
సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో ఆరుగురు కార్మికుల మృతదేహాలకు గాంధీ హాస్పిటల్లో పోస్ట్మార్టం పూర్తైంది. ఆ డెడ్ బాడీలను కాసేపట్లో అంబులెన్స్లో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తరలించనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు విమానంలో బెంగళూరులో ఎయిర్పోర్టుకు తీసుకెళ్లనున్నారు. ఆరు డెడ్ బాడీలను ఈ రాత్రికి బెంగళూరులో భద్రపరచనున్నారు. మిగిలిన 5 మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించిన అనంతరం రేపు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలించనున్నారు. మొత్తం 11 మృతదేహాలను రేపు బెంగళూరు నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా పాట్నాకు పంపనున్నారు. పాట్నా ఎయిర్ పోర్టు నుంచి డెడ్ బాడీలను స్వస్థలాలకు తరలించనున్నారు.