
ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో అర్ధరాత్రి భారీ అగ్ని జరిగింది. యూనిట్ 4లో రియాక్టర్ పేలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ యాక్సిడెంట్ లో ఆరుగురు చనిపోయారు. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన 13 మందిని విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. మార్గ మధ్యలో ఒకరు చనిపోయారు. విజయవాడ ఆస్పత్రిలో 12 మందిని చేర్చారన్నారు సూపరింటెండెంట్ భాగ్యలక్ష్మి. ఒకరిద్దరు తప్ప... మిగతా అందరికీ సీరియస్ గా ఉందన్నారు. బాధితులకు అత్యవసర చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మరో రియాక్టర్ పేలే ప్రమాదం ఉందని తెలియడంతో వేరే ప్రాంతాలకు తరలిపోతున్నారు అంకిరెడ్డిగూడెం ప్రాంతం వాసులు.