గుడ్ న్యూస్ : డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన 6 బ్యాంకులు

గుడ్ న్యూస్ : డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన 6 బ్యాంకులు

బ్యాంకులు గుడ్ న్యూస్ చెప్పాయి. దేశంలోని ఆరు ప్రధాన బ్యాంకులు.. ఫిక్సుడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. ఏయే బ్యాంక్.. ఎంతెంత వడ్డీ రేటు పెంచిందో తెలుసుకుందాం..

 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) : 
ఎస్ బీఐ గతంలో  5.75 శాతం ఉన్న ఫిక్సుడ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్ ను 6 శాతానికి పెంచింది.  7 రోజుల నుంచి 45 రోజుల డిపాజిట్లపై వడ్డీ రేటును 3  నుంచి 3.5 శాతానికి పెంచింది. 46 రోజుల నుండి 179 రోజుల గడుపుతో ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేటును 4.5 నుంచి 4.75 శాతానికి పెంచింది. 180 రోజుల నుంచి 210 రోజుల గడువు ఉన్న డిపాజిట్లపై వడ్డీని 5.25 నుంచి 5.75 శాతానికి పెంచింది. ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల కాల పరిమితితో ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేటును యధాతథంగా ఉంచింది. ప్రస్తుతం 6.80 శాతాన్నే ఇస్తుంది. ఇక 2 నుంచి 3 సంవత్సరాలకు గాను 7 శాతం, 3 నుంచి 5 సంవత్సరాల కాలానికి వడ్డీ రేటును 6.75 శాతంగా నిర్ణయించింది స్టేట్ బ్యాంక్ ఇండియా.

 ఐసీఐసీఐ బ్యాంక్ : 
దేశంలోనే రెండవ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ కూడా వడ్డీ రేట్లు భారీగా  పెంచింది. గతంలో 6.7 శాతంగా ఉన్న వడ్డీ రేటును 7. 25 శాతంగా చేసింది. 61 రోజుల నుంచి 90 రోజుల ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేటును 4.5 శాతం నుండి 6 శాతానికి పెంచింది. 91 రోజుల నుంచి 184 రోజుల వరకు ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేటును 4.75 శాతం నుంచి 6.5 శాతానికి పెంచింది. 185 రోజుల నుంచి 270 రోజులు వరకు ఉన్న  డిపాజిట్లపై వడ్డీ రేటును 5.75 నుంచి 6.75 శాతానికి పెంచింది.390 రోజుల నుంచి 15 నెలల వరకు ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేటును 6.7 శాతం నుంచి 7.25 శాతానికి పెంచింది. 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేటును 6.9 నుండి 7 శాతానికి పెంచింది ఐసీసీఐ బ్యాంక్

 హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ : 
ప్రైవేట్ రంగంలో నెంబర్ వన్ గా ఉన్న హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు వడ్డీ రేటు భారీగా పెంచింది.  ఒక సంవత్సరం నుంచి 15 నెలల గడువు ఉన్న డిపాజిట్ల పై  వడ్డీ రేటును 6.6 శాతాన్ని పెంచింది. 15 నెలల నుంచి 18 నెలల వరకుఉన్న డిపాజిట్లపై 7.10 శాతం వడ్డీ రేటును ఇస్తుంది.18 నెలల నుంచి 21 నెలల వరకు ఉన్న డిపాజిట్లపై 7 శాతం వడ్డీ రేటును ఇస్తుంది. 21 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు ఉన్న డిపాజిట్లపై 7 శాతం వడ్డీ రేటును ఇస్తుంది. అత్యధికంగా 4 సంవత్సరాల కాలం నుంచి ఉన్న డిపాజిట్లపై 7.20 శాతం వడ్డీ రేటు ఇస్తుంది. 

 బ్యాంక్ ఆఫ్ బరోడా : 
బ్యాంక్ ఆఫ్ బరోడా డిసెంబర్ 29, 2023 నుంచి అమల్లోకి తెచ్చిన వడ్డీ రేట్ల ప్రకారం ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు ఉన్న డిపాజిట్లపై 6.85 శాతం వడ్డీ రేటును ఇస్తుంది. 2 నుంచి 3 సంవత్సరాల మధ్య  ఉన్న డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ రేటును ఇస్తుంది. 3 నుంచి 10 సంవత్సరాల మధ్య గల డిపాజిట్లపై 6.5 శాతం వడ్డీ రేటును ఇస్తుంది. 

 యాక్సిస్ బ్యాంక్ : 
యాక్సిస్ బ్యాంక్ కూడా ఫిక్సుడ్ డిపాజిట్ పై వడ్డీ రేటు పెంచింది. డిసెంబర్ 26, 2023 నుంచి, యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.7 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఒక సంవత్సరం నుంచి 15 నెలల వరకు, 15 నెలల నుంచి ఐదేళ్ల వరకు డిపాజిట్లపై 7.10 శాతం వడ్డీ రేటును ఇస్తుంది. స్వల్పకాలిక ఫిక్కుడ్ డిపాజిట్లకు 4.75 శాతం నుంచి 6 శాతం మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. 

డీసీబీ బ్యాంక్:
  డిసెంబర్ 13, 2023 నుండి, డీసీబీ బ్యాంక్ ఫిక్సుడ్ డిపాజిట్ పై 7.15 శాతం వడ్డీ రేట్ ఆఫర్ చేస్తోంది. 12 నెలల నుంచి 12 నెలల10 రోజుల కాల వ్యవధి గల ఫిక్సుడ్ డిపాజిట్లకు 7.85 శాతం వడ్డీని ఇస్తుంది. 25 నెలల నుంచి 26 నెలల మధ్య కాల వ్యవధి డిపాజిట్లకు అత్యధిక రేటు 8 శాతం అందిస్తున్నట్టు తెలిపింది.