నిలోఫర్ ఆస్పత్రిలో ఆరు నెలల బాలుడు మిస్సింగ్

నిలోఫర్ ఆస్పత్రిలో ఆరు నెలల బాలుడు మిస్సింగ్

హైదరాబాద్: నాంపల్లిలోని నిలోఫర్ ఆస్పత్రిలో ఆరునెలల బాబు మిస్సింగ్ కలకలం రేపింది. గండిపేటకు చెందిన సల్మాన్ ఖాన్ కుమారుడు ఫైజల్ ఖాన్ నిలోఫర్ ఆస్పత్రిలో అదృశ్యమయ్యాడు.

పెద్ద కొడుక్కి ఆరోగ్యం బాగోలేకపోవడం నిలోఫర్ కు తీసుకువచ్చారు. అన్నం పెడుతున్నారని బాబు తల్లి ఫరీదా బయటకు వెళ్లింది. తిరిగి వచ్చే సరికి తన చిన్న కుమారుడు ఫైజల్ ఖాన్ కనిపించకుండా పోయాడు. చికిత్స కోసమని ఆస్పత్రికి తీసుకవస్తే.. చిన్నారి కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. 

 

నిలోఫర్ ఆస్పత్రిలో మరోసారి భద్రతాలోపం బయటపడింది. ఆస్పత్రిలో ఏర్పాటు సీసీ కెమెరాలు చేసినప్పటికీ ఎక్కడా పనిచేయడం లేదు. బాలుడి ఆచూకీ తెలియకపోవడంతో తండ్రి సల్మాన్ ఖాన్ నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

కొడుకు కనిపించకుండా పోవడంతో తల్లి ఫరీదా బోరున ఏడుస్తోంది. ‘‘ ఆరోగ్యం బాగోలేదని నా పెద్దకొడుకు నిలోఫర్ ఆస్పత్రిలో చేర్చాం.. అన్నం పెడున్నారంటే.. నా  చిన్నకొడుకు ఫైజల్ ఖాన్ ను బెడ్ పై పడుకోబెట్టి బయటకు వెళ్లాను.. 15 నిమిషాల్లో తిరిగొచ్చేసరికి ఫైజల్ కనిపించకుండా పోయాడని’’ బాబు తల్లి ఫరీదా చెపుతోంది.  ఓ చాక్లెట్ కలర్ నైటీ, ఓల్లో కలర్ చున్నీ వేసుకున్న మహిళ.. తన కుమారుడిని ఎత్తుకెళ్లినట్లు ఫరీదా అనుమానం వ్యక్తం చేస్తోంది. 

https://youtu.be/X89YWw1WwxA?si=LzxEY5eV53wmFSpX