
చైనాలో ఒక కారు భీభత్సం సృష్టించింది. సెంట్రల్ చైనాలో జనంపైకి కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్పాట్ లో ఉన్న పోలీసులు కారు డ్రైవర్‌పై కాల్పులు జరపడంతో అతడు మృతి చెందాడు. సెంట్రల్ చైనా హుబీ ప్రొవిన్స్‌లోని జావోయాంగ్ నగరంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఇటీవల కాలంలో చైనాలో ఇటువంటి ఘటనలు జరగడం సాధారణమయ్యాయి.