పాకిస్తాన్‌‌తో మొదలైన ప్రస్థానం: కెప్టెన్‌గా ధోనికి 16 ఏళ్లు

పాకిస్తాన్‌‌తో మొదలైన ప్రస్థానం: కెప్టెన్‌గా ధోనికి 16 ఏళ్లు

అది 2007.. వన్డే వరల్డ్ కప్ లో భారత్ కనీసం సూపర్-8 దశకు అర్హత సాధించలేకపోయింది. పసికూన బంగ్లాదేశ్ జట్టుని ఓడించలేక చతికిలపడింది. జట్టు నిండా స్టార్ ప్లేయర్లు ఉన్నా నడిపించే నాయకుడు కరువయ్యాడు. కెప్టెన్ గా గంగూలీ తప్పుకున్నాక ఆ బాధ్యతను ఎవరు సమర్ధవంతగా పోషిస్తారు అనే ప్రశ్నకు సరైన సమాధానం లేకుండా పోయింది. ఇంకేముంది ఇండియా పతనం మొదలయింది అని విమర్శలు గుప్పించారు. అయితే ఈ సమయంలో అనుభవం లేని 226 ఏళ్ళ కుర్రాడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి బీసీసీఐ సరి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. 

ఇంకేముంది.. జట్టులో చోటు దక్కుతుందో లేదో అనే కుర్రాడికి ఏకంగా కెప్టెన్సీ అప్పజెప్పటం అప్పట్లో సంచలనంగా మారింది. దీంతో విమర్శించే నోటికి మరింతగా విమర్శించే అవకాశం వచ్చింది. కట్ చేస్తే.. ఆ ఏడాది వన్డే ప్రపంచ కప్ ని ఓటమిని మరిపిస్తూ.. టీమిండియాకు పొట్టి ప్రపంచ కప్ అందించి భారత క్రికెట్ లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. అతడెవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. కెప్టెన్ గా క్రికెట్ లో ఒక కొత్త ట్రెండ్ సృష్టించిన ధోనీ ప్రస్థానానికి నేటితో పదహారేళ్లు. 

Also Read :- పాకిస్తాన్ vs శ్రీలంక: మ్యాచ్ ర‌ద్దయితే.. ఫైన‌ల్లో ఇండియాతో తలపడేదెవ‌రు? 

2007 టీ 20 వరల్డ్ కప్ తో తొలిసారి టీమిండియాను నడిపించిన మాహీ.. తొలి మ్యాచ్ స్కాట్లాండ్ తో రద్దయింది. అయితే తర్వాత మ్యాచ్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఆడగా టైగా ముగిసిన ఈ మ్యాచులో ధోనీ కెప్టెన్సీతోనే టీమిండియాకు తొలి విజయం దక్కింది. ఇక ఇది మొదలుకొని మహేంద్రుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా టీమిండియాను అగ్ర స్థానానికి చేర్చాడు. 2009 లో టెస్టులో టీమిండియాను టాప్ లో నిలిపిన మాహీ.. 2011 లో వన్డే వరల్డ్ కప్ అందించి 28 ఏళ్ళ స్వప్నాన్ని నిజం చేసాడు.  

2013 లో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా కూడా అందించి మూడు ఐసీసీ టైటిల్స్ గెలిపించిన ఏకైక కెప్టెన్ గా నిలిచాడు. ఇక మహీ 2008 తన కెప్టెన్సీలో ఆస్ట్రేలియాలో ముక్కోణపు సీరీస్ ని అందించి ప్రపంచాన్ని శాసిస్తున్న ఆసీస్ ని కిందకు దించాడు. ఎన్నో ఓడిపోతున్న మ్యాచులను కేవలం తన కెప్టెన్సీ ద్వారా గెలిపించిన ఘనత ధోనీదే. ఇక ఇండియాలో ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న ఐపీఎల్ లో ధోని చెన్నై సూపర్ కింగ్స్ కి 5 సార్లు టైటిల్ అందించాడు. ఇక ధోనీ ప్రస్తానం గురించి చెప్పుకుంటా ఈ ప్రవాహం ఆగదు.తవ్వే కొద్ది ఈ మహానుభావుడి కెప్టెన్సీ వస్తూనే ఉంటుంది. టీమిండియా ఎంతగానో ఆరాధించే క్రికెట్ లోధోనీ అభిమానులకి ఇచ్చిన ఆనందం ఎప్పటికీ మర్చిపోలేనిది. ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోనీ సెకండ్ ఇన్నింగ్స్ మరింత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.