పాకిస్తాన్ vs శ్రీలంక: మ్యాచ్ ర‌ద్దయితే.. ఫైన‌ల్లో ఇండియాతో తలపడేదెవ‌రు? 

పాకిస్తాన్ vs శ్రీలంక: మ్యాచ్ ర‌ద్దయితే.. ఫైన‌ల్లో ఇండియాతో తలపడేదెవ‌రు? 

ఆసియా కప్‌లో మరో కీలక మ్యాచ్ వర్షార్పణం అయ్యేలా కనిపిస్తోంది. సూప‌ర్-4 స్టేజ్‌లో భాగంగా ఇవాళ(గురువారం) శ్రీలంక‌ - పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడుతున్నాడు. దీంతో మైదానం అంతటిని సిబ్బంది కవర్లతో కప్పి ఉంచారు. వరుణుడు శాంతిస్తే మ్యాచ్ ఆలస్యంగా ఆరంభం కానుంది. ఒకవేళ వ‌ర్షం తగ్గకపోతే ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు కనుక..  ర‌ద్దవ్వడం తప్ప మరోదారి లేదు. అదే జరిగితే ఇండియాతో ఫైన‌ల్లో తలపడే మరో జట్టు ఏదన్నది ఇప్పుడు చూద్దాం.. 

పాక్ గెలిస్తే మరోసారి దాయాదుల పోరు

ఇప్పటికే సూప‌ర్-4 స్టేజ్‌లో రెండు మ్యాచ్‌లు గెలిచిన మనోళ్లు ఫైనల్‌లో అడుగుపెట్టారు. ఇప్పుడు తేలాల్సిందల్లా భారత్‌తో టైటిల్‌ పోరులో అమీతుమీ తేల్చుకొనే మరో జట్టు ఏదనే ! ప్రస్తుతానికి లంక‌, పాక్‌లు రెండేసి పాయింట్ల‌తో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. గురువారం ఈ ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌‌లో విజయం సాధించిన జట్టు ఫైనల్‌ చేరుతుంది. ఒకరకంగా ఈ మ్యాచ్ సెమీఫైనల్‌ లాంటిదే. శ్రీలంకపై బాబర్‌ సేన నెగ్గితే టైటిల్‌ ఫైట్‌కు చేరుతుంది. అదే జరిగితే..ఆసియా కప్‌ చరిత్రలో భారత్‌ - పాకిస్తాన్ తొలిసారి ఫైనల్లో ఢీకొంటాయి.

Also Read :- కొడితే స్టేడియం అద్దాలే పగిలిపోయాయి.. విండీస్ బ్యాటర్ల పవర్ ఇదీ

వర్షార్పణమైతే..

ఈ మ్యాచ్‌లో ఫలితం తేలాలంటే క‌నీసం 20 ఓవ‌ర్ల మ్యాచ్ అయినా ఆడాల్సి ఉంటుంది. కానీ పరిస్థితులు అలా కనిపించటం లేదు. ప్రస్తుతం కొలంబోలో భారీ వర్షం కురుస్తోంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయితే.. పాకిస్తాన్ (-1.892) కంటే మెరుగైన రన్‌రేట్‌ ఉన్న శ్రీలంక (-0.200) ఫైనల్‌ చేరుతుంది. భారత్‌ చేతిలో పాక్.. 228 పరుగుల భారీ తేడాతో పరాజయం కావడంతో పాక్‌ నెట్‌రన్‌రేట్‌ దారుణంగా పడిపోయింది. అదే వారి ఫైనల్ అవకాశాలను దెబ్బకొడుతోంది.

ఇక సూపర్‌-4 దశలో టీమిండియా.. శుక్రవారం బంగ్లాదేశ్ తో తలపడాల్సివుంది. ఈ మ్యాచ్ ఫలితం ఇరు జట్లపై ఎలాంటి ప్రభావము చూపదు. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన బంగ్లాదేశ్‌ ఫైనల్‌ రేసునుంచి నిష్క్రమించింది.