బిగ్ బాస్లో ఆరవవారం ఎలిమినేషన్.. బయటకు వచ్చేది ఆమెనే?

బిగ్ బాస్లో ఆరవవారం ఎలిమినేషన్.. బయటకు వచ్చేది ఆమెనే?

బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7)లో ఐదు వారాలుగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ఈ వారం కూడా లేడీనే ఇంటినుండి బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. అందులో నయని పావని(Nayani pavani), శోభా శెట్టి(Shibha shetty) ఉన్నారు.

నిజానికి శోభా శెట్టిని ఈవారం ఎలిమినేట్ చేయాలని అనుకున్నారు. అందుకే ఆమెకు ఓట్లు వేయడం కూడా మానేశారు. దాంతో ఆమె డేంజర్ జోన్ లో ఉంది. సీజన్ మొదలైనప్పటి నుండి ఇంతో శోభా శెట్టి చేసే హడావుడి, చిన్న విషయాన్ని పెద్దగా చేయడం, ఇవన్నీ ఆడియన్స్ కు చిరాకు తెప్పించింది. అందుకే ఈ వారం శోభా శెట్టిని ఎలాగైనా ఎలిమినేట్ చేయాలని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు.

కానీ.. అనూహ్యంగా కొత్తగా హౌస్ మెట్ నయని పావని ఆమె ఎలిమినేషన్ కు అడ్డుగా మారింది. ఆమె వచ్చి వారమే కావడం, బయట కూడా ఎక్కువ మందికి తెలియకపోవడం ఆమెకు నెగిటీవ్ గా మారింది. దీంతో ఆమెకు వోటింగ్ చాలా తక్కువగా నమోదైంది. నయని పావని వల్ల శోభా శెట్టి సేఫ్ అయ్యిందని తెలుస్తోంది.ఇక్కడే మరో ట్విస్ట్ ఇవ్వనున్నాడు బిగ్ బాస్. నయని పావనిని అలా బయటకు పంపించి శుభశ్రీని ఇంట్లోకి తీసుకొచ్చాడు. దీనికి సంబందించిన ఎపిసోడ్ ఇవాళ టెలికాస్ట్ కానుంది. కానీ నయని పావని ఎలిమినేషన్ ను మాత్రం ఆడియన్స్ ఒప్పుకోవడం లేదు. ఇది ఖచ్చితంగా ఆన్ ఫేర్ ఎలిమినేషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.