
రామ్, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను రూపొందిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’. ‘ది ఎటాకర్’ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతోంది. జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు ప్రమోషన్స్ వేగం కూడా పెంచుతున్నారు మేకర్స్. ఇప్పటికే వచ్చిన టైటిల్ గ్లింప్స్‌కు, తమన్ కంపోజ్ చేసిన ఫస్ట్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇదిలా ఉంటే శనివారం నుంచి ఆఫ్‌లైన్ ప్రమోషన్స్ మొదలుపెట్టినట్టు తెలియజేశారు నిర్మాతలు. దీనిలో భాగంగా ఈ ఫిల్మ్ స్టాండీలు విడుదలయ్యాయి. స్టాండీ ఇమేజెస్ ఒకదానిలో రామ్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో కనిపిస్తున్నాడు. మరొక ఇమేజ్ రామ్, శ్రీలీల రొమాంటిక్ కెమిస్ట్రీని ప్రజంట్ చేస్తోంది. యాక్షన్ పోస్టర్ మాస్‌ని ఆకట్టుకుంటే, రొమాంటిక్ పోస్టర్ యూత్ ఆడియెన్స్‌ని మెప్పిస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.