
రామ్, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను రూపొందిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’. ‘ది ఎటాకర్’ అనేది ట్యాగ్‌లైన్. జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను వాయిదా వేసినట్టు బుధవారం ప్రకటించారు. సెప్టెంబర్ 15న విడుదల కావాల్సి ఉండగా, దీన్ని సెప్టెంబర్ 28కి పోస్ట్ పోన్ చేసినట్టు అనౌన్స్ చేశారు. గాంధీ జయంతి, దసరా సెలవులు కూడా కలిసొచ్చేలా ఈ డేట్‌ని ఫిక్స్ చేసినట్టుగా తెలియజేశారు దర్శక నిర్మాతలు. నిజానికి ఇదే డేట్‌కి ప్రభాస్ ‘సాలార్’ రావలసి ఉంది. అది వాయిదా పడడంతో ఆ డేట్‌ను ‘స్కంద’ రీప్లేస్ చేస్తోంది.
కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో పంచెకట్టులో రామ్ కూల్‌గా కనిపిస్తుండగా, శ్రీలీల గాగ్రా చోళీలో అందంగా కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సయి మంజ్రేకర్, శ్రీకాంత్, గౌతమి, ప్రిన్స్ ముఖ్య పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా సినిమా విడుదల కానుంది.