స్కిన్​ కేర్​ అబ్బాయిలకు అవసరమే

స్కిన్​ కేర్​ అబ్బాయిలకు అవసరమే

అబ్బాయిల్లో బ్యూటీకేర్​ తీసుకునేవాళ్లు తక్కువ . బ్యూటి టిప్స్ అంటే అమ్మాయిలు మాత్రమే ఫాలో అయ్యేవి అనుకుంటారు. కానీ సరైన కేర్​ తీసుకోకపోతే చర్మం నిర్జీవంగా, రఫ్​గా మారుతుంది.  అందుకే అబ్బాయిలు కాస్త కేర్​ తీసుకోవాల్సిందే. స్మార్ట్ గా కనిపించాలంటే ఈ టిప్స్​ ఫాలో అవ్వాల్సిందే.

సోప్స్ వద్దు

అబ్బాయిలంతా ముఖానికి సోప్​ వాడుతుంటారు. కానీ సోప్​ కన్నా ఫేస్ వాష్ లు వాడటం  మంచిది.  సెన్సిటివ్ స్కిన్​ వాళ్లు అయితే అసలు సబ్బు జోలికే వెళ్లకూడదు. మైక్రో బీడ్స్ కలిగిన ఫేస్ వాష్ లు.. టాక్సిన్స్ ని తొలగిస్తాయి. అలాగే చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేస్తాయి. కాబట్టి అలాంటి వాటినే వాడాలి.

సన్ స్క్రీన్

యూవీ కిరణాలకు ఎక్కువగా ఎక్స్ పోజ్ అయితే చర్మం త్వరగా ముడతలు పడుతుంది. అందువల్ల ప్రతిరోజు సన్ స్క్రీన్ ఉపయోగించడం వల్ల చర్మం క్లియర్​గా ఉంటుంది. సూర్య రశ్మి వల్ల ఎలాంటి హాని కలుగకుండా ఉంటుంది.

మాయిశ్చరైజర్

మగవాళ్ల చర్మం ఆడవాళ్ల చర్మానికి కంటే 15 శాతం ఎక్కువ ఆయిలీగా ఉంటుంది. త్వరగా పొడిబారుతుంది కూడా. వీటన్నింటికీ దూరంగా ఉండాలంటే.. లైట్ మాయిశ్చరైజర్ ని అప్లై చేయాలి. చర్మతత్వాన్ని బట్టి సరైన మాయిశ్చరైజర్ ఎంచుకుని.. రోజుకి రెండుసార్లు అప్లై చేయాలి.

హెయిర్ ప్రొడక్ట్స్

ఎక్కువ జెల్స్ ఉన్న హెయిర్ జెల్స్ లో ఆల్కహాల్ ఉంటుంది. ఇది జుట్టు నేచురల్ ఆయిల్స్ ని కోల్పోయేలా చేస్తుంది. జుట్టు డ్రైగా, డ్యామేజ్ అవడానికి కారణమవుతుంది. అందువల్ల అలాంటి జెల్స్ కంటే హెయిర్​ఆయిల్​ ఉపయోగించడం మంచిది.

గడ్డం

గడ్డం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. షాంపూ, కండిషనర్ ని గడ్డంకు వారానికి రెండుసార్లు వాడాలి. ఇది గడ్డాన్ని స్మూత్ గా ఉంచుతుంది. దురద రాకుండా కాపాడుతుంది.

ఫేస్ ప్యాక్స్

ఫేస్ ప్యాక్స్ చర్మంలో పేరుకున్న మురికి, డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తాయి. కొత్త కణాల తయారీకి సాయపడుతుంది. దీనివల్ల చర్మం హెల్దీగా ఉంటుంది. అందుకే వారానికోసారి ఫేస్​ ప్యాక్​ వేసుకోవాలి. రెండు చార్ కోల్ క్యాప్సుల్స్ ని రోజ్ వాటర్ లో కలిపి పేస్ట్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. పావుగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం మృదువుగా, హెల్దీగా ఉంటుంది.