
అడ్వెంచర్‌కు బయలుదేరిన బృందం అనూహ్యంగా మృత్యువాతకు గురైన సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. హవాయి స్టేట్‌లో శనివారం ఓ పారాచూట్ స్కై డైవింగ్ సంస్థకు చెందిన విమానం కుప్పకూలడంతో సిబ్బంది, అడ్వెంచరిస్టులు కలిపి మొత్తం11 మంది ప్రాణాలు కోల్పోయారు. 2011 తర్వాత అమెరికాలో జరిగిన అతి పెద్ద విమాన ప్రమాదం ఇదే కావడం గమనార్హం. సదరు స్కై డైవింగ్ సంస్థ ఓహు ఐలాండ్ కేంద్రంగా పనిచేస్తున్నదని, శనివారం ఫీట్ నిర్వహించేందుకు డిల్లింగ్హామ్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలిందని అధికారులు చెప్పారు. ప్రమాద కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.