రాత్రిపూట మంచి నిద్రపట్టడానికి ఏం చేయాలంటే

రాత్రిపూట మంచి నిద్రపట్టడానికి ఏం చేయాలంటే

 రాత్రిపూట చక్కగా నిద్రపట్టేందుకు వేడి పాలు తాగుతారు చాలామంది. అయితే, చెర్రీ జ్యూస్​, చామంతి టీ తాగినా, అరటిపండు, బాదం స్మూతీ తిన్నా  కూడా తొందరగా నిద్ర పడుతుందట. 
 చామంతి పూలని కప్పు వేడినీళ్లలో వేస్తే, చామంతి టీ రెడీ. రాత్రి పూట ఈ టీ తాగితే చక్కగా నిద్రపట్టడమే కాదు జలుబు, ఇన్​ఫ్లమేషన్​ వంటివి తగ్గుతాయి కూడా.
అరటిపండు, బాదం స్మూతీలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి, మైండ్​ను రిలాక్స్​ చేస్తాయి. దాంతో హాయిగా నిద్రపోవచ్చు. 
తియ్యగా, వగరుగా, పుల్లగా ఉండే చెర్రీ పండ్లలో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్​ ఉంటుంది. ఇది నిద్ర బాగా పట్టేలా చేస్తుంది.