
- తొలిరోజు 38 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.9.28 లక్షల ఆదాయం
మంచిర్యాల, వెలుగు: సబ్ రిజిస్ట్రార్ఆఫీసులో రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు పడుతున్న బాధలు ఇక తీరినట్టే. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానం ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తవుతున్నాయి. మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో సోమవారం స్లాట్‌బుకింగ్ సిస్టం ప్రారంభమైంది. మొదటిరోజు 38 స్లాట్లు బుక్ కాగా, జాప్యం లేకుండా 15 నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తిచేశారు. సేల్, రిలీజ్, మార్ట్గేజ్, గిఫ్ట్డీడ్తదితర రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.9.28 లక్షల ఆదాయం వచ్చింది.
మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్‌గా ప్రియాంక పనిచేస్తుండగా అదనంగా మరొకరిని కేటాయించారు. కరీంనగర్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాజిరెడ్డిని సెకండ్ఎస్ఆర్గా నియమించారు. తొలిరోజు స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఆదిలాబాద్ జిల్లా రిజిస్ట్రార్రవీందర్రావు పర్యవేక్షించారు. 15 నిమిషాల్లో ప్రక్రియ పూర్తిచేసి డాక్యుమెంట్లు అందజేశామని ఆయన తెలిపారు. ప్రతి రోజు ఒక్కో ఎస్‌ఆర్‌కు 48 స్టాట్లు కేటాయించామని చెప్పారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. ఆన్లైన్లో https;//registration.telangana.gov.in ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని సూచించారు.