ఎంత మోసం.. అరే బుడ్డోడా నీకు అప్పుడే ఇన్ని తెలివి తేటలా

ఎంత మోసం.. అరే బుడ్డోడా నీకు అప్పుడే ఇన్ని తెలివి తేటలా

చిన్నపిల్లలు క్రికెట్ ఆడుతుంటే చూడటానికి ఎంత ముచ్చటగా ఉంటుందో అందరికీ విదితమే. ఔట్ అయినా ఇవ్వకపోవడం, బంతి బౌండరీకి వెళ్లకపోయినా ఫోర్, సిక్స్ అంటూ అరుపులు.. మూడు బంతులు వేయగానే బేబీ ఓవర్ అంటూ పక్కకు తప్పుకోవడం..  బంతిని స్పీడ్‌గా విసిరావంటూ గొడవలు.. అబ్బో ఇలా బోలెడు ఘటనలు జరుగుతుంటాయి. వాటితో పోలిస్తే మన కథనంలో బుడ్డోడు ఆడిన తొండాట మాత్రం ఊహించరానిది. కళ్లు మూసి తెరిసేలోపు తిమ్మిని బమ్మి చేసేశాడు. 

బంతిని బలంగా కొట్టే సమయంలో అదుపుతప్పి వికెట్లను గిరాటేయడం కామన్. క్రికెట్ రూల్స్ పరంగా ఇది ఔట్. ఇలా ఔట్ అవ్వడాన్ని హిట్ వికెట్ అని పిలుస్తుంటారు. మన కథనంలో బ్యాటింగ్ చేస్తున్న కుర్రాడు అచ్చం ఇలానే ఔటయ్యాడు. కాకపోతే క్షణాల వ్యవధిలోనే అక్కడేం జరగలేదన్నట్లుగా మాయ చేశాడు. అతడు కొట్టిన షాట్‍కు బంతి బౌండరీకి వెళ్లినా.. అదుపుతప్పి బ్యాట్‌తో వికెట్లను తాకించాడు. ఆ సమయంలో బెయిల్స్ కూడా కింద పడిపోయాయి. అంతే వెంటనే కళ్లు మూసి తెరిసేలోపు బెయిల్స్ చేతికందుకొని యధాస్థితిలో పెట్టేశాడు. బంతి కోసం బౌలర్ కిందకు వంగి లేచేలోపు అది జరిగిపోయింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట నవ్వులు  పూయిస్తోంది.

ఏమిరా బాలకా..!

ఈ బుడ్డోడి చేసిన చిలిపి పని నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తోంది. ఈ సంఘటనతో వారి వారి చిన్నతనంలో చోటుచేసుకున్న సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మరికొందరైతే అచ్చం ఇలానే చేశావాడిని అంటూ సదరు బుడ్డోడి స్థానంలో వారిని ఊహించుకుంటున్నారు. ఇలాంటి వాళ్లు రాజకీయాల్లోకి వస్తే ప్రతిపక్షమే ఉండదని ఇంకొందరు చమత్కరిస్తున్నారు.

ALSO READ :- బీఆర్ఎస్ లో చేరిన ఏనుగుల రాకేశ్‌ రెడ్డి