చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్ల పెంపు

చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్ల పెంపు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2024 జనవరి–-మార్చి క్వార్టర్​కు వర్తించబోయే చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను శుక్రవారం ప్రకటించింది.   మార్చి 31, 2024 నాటికి, ఎంచుకున్న చిన్న పొదుపు పథకాలు,  పోస్టాఫీసు పథకాలు వడ్డీ రేట్లు పెరుగుతాయి.  సుకన్య సమృద్ధి ఖాతా పథకానికి వడ్డీ రేటు  20 బేసిస్ పాయింట్లు పెరుగుతుంది. అంటే వడ్డీ రేటును 8 శాతం నుంచి 8.2 శాతానికి పెంచారు. మూడేళ్ల డిపాజిట్​పై ప్రస్తుతం ఏడు శాతం వడ్డీ ఇస్తుండగా, దానిని 7.1 శాతానికి పెంచారు.   పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్​) వడ్డీ రేటు మాత్రం 7.1 శాతం వద్ద  యథాతథంగా ఉంది. 

అన్ని ఇతర చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు అక్టోబర్–-డిసెంబర్ కాలంలో మారవు. ప్రభుత్వం నిర్ణయించిన చిన్న పొదుపుపై వడ్డీ రేట్లు గవర్నమెంట్​సెక్యూరిటీల మార్కెట్​ రాబడులను బట్టి మారుతాయి.   ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. శ్యామలా గోపీనాథ్ కమిటీ ఈ రేట్లను నిర్ణయించే పద్ధతిని ప్రతిపాదించింది.  చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు సెకండరీ మార్కెట్‌‌‌‌లోని 10 సంవత్సరాల ప్రభుత్వ సెక్యూరిటీల రాబడులతో ముడిపడి ఉంటాయి.