మొక్కలకి షెల్ఫ్లొచ్చినయ్
V6 Velugu Posted on Jan 27, 2022
పచ్చని చెట్లు ఎక్కడున్నా అందం, ఆనందమే. అందులోనూ హాల్లో ఉంటే కళ్లకి, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. కానీ, ఇండోర్ ప్లాంట్స్‌తో వచ్చిన సమస్యల్లా వాటిని ఎక్కడ పెట్టాలి? అనేదే. టీపాయ్, డైనింగ్ టేబుల్స్ మీద పెడితే అటుఇటు జరపడం ఇబ్బంది. ఇంటి మూలల్లో పెడితే పెద్దగా ఎలివేట్ అవ్వవు. ఈ సమస్యకి సొల్యూషన్‌గా వచ్చినవే వాల్ షెల్ఫ్‌లు. డిఫరెంట్ షేప్స్‌లో ఉండే ఈ షెల్ఫ్‌లలో చిన్నచిన్న మొక్కలు పెడితే ఇంటికి కొత్త అందం వస్తుంది. ఇతర డెకరేటివ్ పీస్‌లు కూడా ఈ షెల్ఫ్‌లలో పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో 800 రూపాయల నుంచి ఇవి దొరుకుతున్నాయి.
Tagged Indoor Plants, Evergreen trees, corners of the house, Small shelves, different shapes, new beauty to the home