పెద్ద సినిమాల రాకతో చిన్న సినిమాలకు తప్పని కష్టాలు

పెద్ద సినిమాల రాకతో చిన్న సినిమాలకు తప్పని కష్టాలు

ఆగస్టు మొత్తాన్ని స్టార్ హీరోలు టార్గెట్ చేశారు. ‘బింబిసార’, ‘సీతా రామం’ సినిమాలు వచ్చి హిట్ కొట్టాయి. ఇప్పటికీ థియేటర్లలో ఈ చిత్రాలు సందడి చేస్తున్నాయి. రీసెంట్ గా నితిన్ 'మాచర్ల నియోజక వర్గం', నిఖిల్ 'కార్తికేయ 2' మూవీలు కూడా రిలీజ్ అయ్యాయి. ఇక ఆగస్టు 25న విజయ్ దేవరకొండ 'లైగర్' గా రాబోతుండగా.. 31న విక్రమ్ 'కోబ్రా' గా వస్తున్నాడు. ఇలా పెద్ద హీరోలు ఈ నెల మొత్తం అక్రమించడంతో చిన్న సినిమాలకు ఇబ్బందిగా మారింది. అయినా కొన్ని సినిమాలు ఇదే నెలలో థియేటర్లకు రావాలి అనుకుంటున్నాయి. సందట్లో సడేమియా అంటూ.. ఆగస్ట్ 19న రిలీజ్ కు ముస్తాబవుతున్నాయి. ఈ డేట్ కు స్టార్ల చిత్రాలు లేకపోవటంతో విడుదలకు నిర్ణయం తీసుకున్నారు.

కాగా, యువ హీరో ఆది సాయికుమార్ తన మొదటి సినిమాతో మురిపించినా... ఇప్పటికీ అతడు మరో విజవాన్ని అందుకోలేదు. కానీ ఒక్క హిట్ లేకపోయిన చేతిలో మూడు, నాలుగు సినిమాలు ఉండేలా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ హీరో నటించిన 'తీస్మార్ ఖాన్' రిలీజ్ కు రెడీగా ఉంది. ఆగస్ట్ 19న ఈ చిత్రం విడుదల కానుంది. బుల్లి తెర నటులు, వెండి తెర కమెడియన్లు నటించిన మూవీ 'పండుగాడ్'. రాఘవేంద్ర రావు సమర్పిస్తున్న ఈ మూవీ కూడా ఇదే డేట్ కు రాబోతుంది. హర్రర్ జోనర్ లో రూపొందిన స్మాల్ బడ్జెట్ మూవీ 'మాట రాని మౌనమిది' కూడా రిలీజ్ కు సేమ్ డేట్ ను ఎంచుకుంది. ఇక ఆనంద్ దేవరకొండ మూడు సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ‘హైవే’ మూవీతో రాబోతున్నాడు. అయితే ఈ మూవీ డైరెక్ట్ గా ఆహాలో స్ట్రీమింగ్ కాబోతుంది.