న్యూఢిల్లీ : ఈ ఏడాది చిన్న కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు బంపర్ లాభాలు తెచ్చి పెట్టాయి. ఎకానమీ బలంగా ఉండడంతో చిన్న కంపెనీల ఫ్యూచర్ బాగుంటుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. రిటైల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ పెరగడంతో కూడా వీటికి కలిసొచ్చింది. మార్కెట్ కొన్ని నెలల నుంచి బుల్ రన్‌లో ఉందని, మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 45 శాతం (13,075 పాయింట్లు) పెరిగింది. ఇదే టైమ్‌లో మిడ్‌క్యాప్ ఇండెక్స్ 42 శాతం (10,568 పాయింట్లు ) ర్యాలీ చేసింది.
వీటితో పోలిస్తే లార్జ్ క్యాప్ ఇండెక్స్ బీఎస్‌ఈ సెన్సెక్స్ 17 శాతం (10,266 పాయింట్లు) మాత్రమే లాభపడింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఈ నెల 20 న 42,648 లెవెల్ దగ్గర జీవిత కాల గరిష్టాన్ని నమోదు చేయగా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 36,483 దగ్గర ఆల్ టైమ్ హైని రికార్డ్ చేసింది. సెన్సెక్స్ కూడా ఈ నెల 20 న 71,913 లెవెల్‌కు చేరుకొని కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. సాధారణంగా బ్లూచిప్ కంపెనీల మార్కెట్ క్యాప్‌లో ఐదో వంతు ఉన్న కంపెనీలను మిడ్‌క్యాప్‌లుగా పిలుస్తారు. అదే పదో వంతు ఉంటే స్మాల్‌క్యాప్ షేర్లని అంటారు. ఎకానమీ స్ట్రాంగ్‌గా ఉంటే స్మాల్, మిడ్ క్యాప్ సెగ్మెంట్‌లో బుల్లిష్ ట్రెండ్ కనిపిస్తుంది.
