స్మార్ట్​ఫోన్లలో లీడర్ వివో

స్మార్ట్​ఫోన్లలో  లీడర్ వివో

న్యూఢిల్లీ: యాపిల్ ఐఫోన్ సప్లయ్‌లు ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్‌‌లో ఏడాది లెక్కన 25 శాతం పెరిగాయి. స్మార్ట్​ఫోన్ సెగ్మెంట్‌లో  ఈ కంపెనీ మార్కెట్ వాటా 8 శాతంగా ఉంది.   సైబర్‌ మీడియా రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం, వివో 20 శాతం మార్కెట్ షేర్‌తో భారత స్మార్ట్​ఫోన్ మార్కెట్‌ను లీడ్ చేస్తోంది. శామ్‌సంగ్‌ 18 శాతం షేర్‌తో రెండో స్థానంలో,  షియోమీ 13 శాతం మార్కెట్ షేర్‌తో మూడో స్థానంలో ఉన్నాయి.  ఓప్పో  12 శాతం మార్కెట్ షేర్‌ను సాధించిందని సైబర్​ మీడియా తెలిపింది.