స్మార్ట్ టీవే కంప్యూటర్.. జియో పీసీ సర్వీస్‌‌ షురూ

స్మార్ట్ టీవే కంప్యూటర్.. జియో పీసీ సర్వీస్‌‌ షురూ

న్యూఢిల్లీ: టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో సబ్‌‌స్క్రిప్షన్ ఆధారిత పర్సనల్ కంప్యూటర్ సర్వీస్‌‌ను ప్రారంభించింది. దీని ద్వారా సబ్‌‌స్క్రయిబర్లు తమ టీవీను సెట్-టాప్- బాక్స్ సహాయంతో పర్సనల్ కంప్యూటర్‌‌లుగా మార్చుకోవచ్చు. నెలవారీ ప్లాన్లు రూ.599 నుంచి ప్రారంభమవుతాయి. ఏడాది ప్లాన్​కు రూ.4,599 చెల్లించాలి.

 పీసీ సేవను పొందడానికి, జియోఫైబర్​,  జియో ఎయిర్​ఫైబర్​యూజర్లు యాప్ విభాగంలో జియో పీసీ యాప్‌‌పై క్లిక్ చేయాలి. 8జీబీ ర్యామ్​, 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఉన్న పర్సనల్ కంప్యూటర్‌‌ను ఉపయోగించడానికి కీబోర్డ్,  మౌస్ అవసరం.   ఒక నెల ఉచిత ట్రయల్‌‌లో జియో వర్క్​స్పేస్​, మైక్రోసాఫ్ట్​ ఆఫీస్​ సేవలను పొందవచ్చు.