ఇండియన్ ఒలింపిక్ లోగోను రీబ్రాండింగ్ చేస్తున్న స్మితా రాజగోపాల్

ఇండియన్ ఒలింపిక్ లోగోను రీబ్రాండింగ్ చేస్తున్న స్మితా రాజగోపాల్

కొన్ని  యాడ్స్   మనసుల్ని   కదిలిస్తాయ్. ఆ యాడ్ అయిపోయిన తర్వాత  కూడా దాని  గురించే ఆలోచించేలా చేస్తాయ్.  లోగోలు కూడా అంతే. చూడంగానే ఆకట్టుకుంటాయి.అందంగా..ఈ జీగా కంపెనీ పేరును కమ్యూనికేట్ చేస్తాయి. అయితే,   వీటిని తీర్చిదిద్దాలంటే ఎంతో  క్రియేటివిటీ  అవసరం. ఇలాంటి క్రియేటివ్ ఫీల్డ్ లో  తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు చెన్నైకి చెందిన  స్మితా రాజగోపాల్. యునైటెడ్ నేషన్స్, వాల్ట్ డిస్నీ, ప్యానాసోనిక్  లాంటి సంస్థలకు లోగోలు క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్  లోగో ను రీబ్రాండ్ చేసే పనిలో ఉన్నారు.

ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ లోగో అంటే  మన దేశ ఐడెంటిటీ, గౌరవాన్ని  ఒక సింబల్ రూపం లో  ప్రపంచానికి తెలియజేయడం. 90 ఏళ్ల కింద బ్రిటిషర్ల కాలంలో  ఈ లోగో  ను రూపొందించారు.  అప్పటినుంచి ఈ లోగోను  మార్చలేదు. కానీ, ఇప్పుడు దీన్ని రీబ్రాండ్ చేసే బాధ్యత  స్మిటెన్ వరల్డ్ వైడ్ ఫౌండర్ స్మితా రాజగోపాల్ అందుకున్నారు.   ‘ఇండియాకు ఇప్పటివరకూ కమర్షియల్ ఐడెంటిటీ లేదని అయితే ఇప్పుడు లోగో, షర్ట్స్ ద్వారా బిజినెస్‌‌ పరమైన ఐడెంటిటీ దొరికేలా చేయాలంటున్నారు  స్మితా రాజగోపాల్.

ప్రతి పనిలో  స్పెషాలిటీ

స్మితా చేసే ప్రతి పనిలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. కస్టమైడ్ సర్వీస్ లోగోస్, వెబ్ సైట్స్, బ్రోచర్లు..ఏది చేసినా అందులో  స్మిత ఐడెంటిటీ కనిపిస్తుంది.  మన దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా స్మితా క్రియేట్ చేసిన బ్రాండ్స్  ఉన్నాయి. ఇప్పటివరకూ యునైటెడ్ నేషన్స్, వాల్ట్ డిస్నీ, యునీలివర్, హిల్టన్, తాజ్ హోటల్స్ , షెరాటన్ హోటల్స్, మాటెల్, ప్యానసోనిక్, బాకర్డి, లాగిటెక్, పెర్ ఫెట్టి, వాగమమా, మ్యాక్సెల్ వంటి 500 రకాల బ్రాండ్స్ ను  స్మితా  క్రియేట్ చేశారు.

స్మిటెన్ వరల్డ్ వైడ్

చిన్నప్పటి నుంచి స్మిత ఏ పని చేసినా క్రియేటివ్ గానే చేసేవారు. అదే ఆమెను డిజైనింగ్ ఫీల్డ్ వైపు నడిపించింది. కోర్సు పూర్తైన తర్వాత కొన్ని కంపెనీల్లో ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసారు. 2008లో  స్మిటెన్ వరల్డ్ వైడ్ పేరుతో చెన్నైలో తన సొంత ఫర్మ్ ను స్టార్ట్ చేశారు. ప్రస్తుతం స్మిత న్యూయార్క్ నుంచి వర్క్ చేస్తున్నారు. దుబాయ్ లో కూడా స్మితకు బ్రాంచ్ ఉంది. వర్కే కాదు.. క్లయింట్ తో మంచి రిలేషన్ ఏర్పరచుకోవడం కూడా చాలా ముఖ్యమంటారు స్మితా.