
లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన స్మృతి ఇరానీ ప్రస్తుతం తన విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న యూపీలోని అమేథీ నియోజక వర్గంలో స్మృతి బీజేపీ జెండా ఎగరెశారు. ప్రధాని అభ్యర్థి రాహుల్ ని ఓడించడం అంటే మామూలు విషయం కాదు. దేవుని ఆశీస్సులతో, తన కష్టంతో ఆ నియోజకవర్గ ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించారు.
తన కోరిక ఫలించిన కారణంగా.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతి రోజే దేవుడికి మొక్కిన మొక్కులు తీర్చుకుంటున్నారు స్మృతి . తన స్నేహితురాలు ఏక్తాకపూర్ తో కలసి పాదయాత్రగా ముంబైలోని సిద్దివినాయక స్వామిని దర్శించుకున్నారు. చెప్పులు లేకుండా కాలినడకన దాదాపు 14 కిలోమీటర్లు నడిచి మరీ వారిద్దరు స్వామివారిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఏక్తా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ” 14 కిలోమీటర్ల కాలినడక తర్వాత మా ముఖాల్లో మెరుపు చూడండి” అన్న క్యాప్షన్ తో ఈ ఫోటోలు పెట్టారు.