బుుతుస్రావం వైకల్యం కాదు.. నెలసరి సెలవుపై స్మృతి ఇరానీ కామెంట్స్

బుుతుస్రావం వైకల్యం కాదు.. నెలసరి సెలవుపై స్మృతి ఇరానీ కామెంట్స్

ప్రపంచంలోని చాలా దేశాలు మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులిచ్చే ప్రతిపాదనపై చర్చిస్తుండగా.. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఋతుస్రావం అనేది వికలాంగం కాదని, అందుకు వేతనంతో కూడిన సెలవు విధానం అవసరం లేదని  అన్నారు. ఇటీవల కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌.. అన్ని పని ప్రదేశాల్లోనూ వేతనంతో కూడిన బుుతుక్రమ సెలవులను తప్పనిసరి చేసే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదని లోక్‌సభలో చెప్పారు. ఈ క్రమంలో ఆయన కామెంట్స్ పై ఆమె తాజాగా స్పందించారు.

ఋతుస్రావం అనేది స్త్రీ జీవిత ప్రయాణంలో ఓ భాగమే కానీ.. అది వైకల్యం కాదని స్మృతి ఇరానీ చెప్పారు. నెలసరి సమయంలో మహిళలకు సెలవులివ్వడమనేది పని ప్రదేశంలో వివక్షకు దారి తీయొచ్చన్నారు. 10-19ఏళ్ల అమ్మాయిల్లో పలు కార్యక్రమాల ద్వారా నెలసరి శుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఇప్పటికే అమల్లో ఉన్న ప్రమోషన్ ఆఫ్ మెన్ స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్(ఎంహెచ్ఎం) స్కీమ్ గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు.

బుుతుస్రావం అనేది స్త్రీలలో జరిగే ఓ శారీరక ప్రక్రియ అని, కొద్దిమంది మహిళలు మాత్రమే డిస్మెనోరియా వంటి సమస్యలతో బాధపడుతుంటారని స్మృతి ఇరానీ చెప్పారు. ఇలాంటి సమస్యలను చాలా వరకు మందుల ద్వారా నయం చేసుకోవచ్చన్నారు.