V6 News

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫెయిలైన మంధాన ర్యాంక్ డౌన్‌

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫెయిలైన మంధాన ర్యాంక్ డౌన్‌

దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫెయిలైన ఇండియా విమెన్స్ టీమ్ స్టార్ బ్యాటర్  స్మృతి మంధాన ర్యాంక్ పతనమైంది. ఐసీసీ మంగళవారం విడుదల చేసిన టీ20 బ్యాటర్ల లిస్టులో నాలుగు నుంచి ఐదో ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పడిపోయింది. అయితే ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాణించిన కెప్టెన్ హర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్ కౌర్ ఒక స్థానం మెరుగుపరుచుకుని తిరిగి టాప్-10లోకి వచ్చింది. 

వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ 22వ ర్యాంక్​కు చేరుకుంది. కివీస్ స్టార్ ప్లేయర్ జార్జియా వోల్ 815 రేటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్లతో టాప్ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కొనసాగుతోంది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వార్ట్ మూడో ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కైవసం చేసుకుంది.  ఇండియా ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్ దీప్తి శర్మ బౌలర్ల విభాగంలో నాలుగో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకుంది.