ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌‌‌‌లో..మంధాన @ 4

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌‌‌‌లో..మంధాన @ 4

దుబాయ్‌‌‌‌ : విమెన్స్‌‌‌‌ టీమిండియా వైస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ స్మృతి మంధాన.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌‌‌‌లో ఒక ప్లేస్‌‌‌‌ కిందకు దిగజారింది. మంగళవారం విడుదల చేసిన తాజా జాబితాలో ఆమె 738 రేటింగ్‌‌‌‌ పాయింట్లతో నాలుగో ప్లేస్‌‌‌‌లో నిలిచింది.

సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో 343 రన్స్‌‌‌‌ చేసినా ఒక ర్యాంక్‌‌‌‌ కోల్పోవడం గమనార్హం. కెప్టెన్‌‌‌‌ హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ కౌర్‌‌‌‌ రెండు స్థానాలు ఎగబాకి 9వ ర్యాంక్‌‌‌‌లో నిలిచింది.