దుబాయ్: ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన.. ఐసీసీ విమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ (అక్టోబర్) రేసులో నిలిచింది. ఇండియా తొలి వరల్డ్ కప్ సాధించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఆస్ట్రేలియా (80), ఇంగ్లండ్ (88)పై తన బ్యాట్ పవర్ చూపెట్టిన స్మృతి.. టోర్నీలో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో అద్భుతం చేసింది.
ఓపెనర్ ప్రతీకా రావల్‌తో కలిసి కివీస్పై 212 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పి ఇండియా ఆశలను సజీవంగా నిలిపింది. ఇక ఫైనల్లోనూ స్మృతి (45), షెపాలీతో కలిసి మెరుపు ఆరంభాన్నిచ్చింది. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఓడిన సౌతాఫ్రికాను ఫైనల్ వరకు తీసుకురావడంలో వోల్‌వర్ట్ కీలక పాత్ర పోషించింది. న్యూజిలాండ్ (115), ఇంగ్లండ్ (104*)పై సెంచరీలు చేయడంతో గార్డ్‌నర్‌ను రేసులో నిలిపాయి.
