దుబాయ్: ఇండియా విమెన్స్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ను మరింత బలోపేతం చేసుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా జాబితాలో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్న స్మృతి కెరీర్ బెస్ట్ 828 రేటింగ్ పాయింట్లకు చేరుకుంది. వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ (109), బంగ్లాదేశ్ (34 నాటౌట్)పై రాణించడం ఆమె రేటింగ్ పాయింట్లు పెరగడానికి దోహదం చేసింది.
ఇంగ్లండ్‌పై సెంచరీతో చెలరేగిన ఆస్ట్రేలియా బ్యాటర్ ఆష్లే గార్డ్‌నర్ (731) ఏకంగా ఆరు స్థానాలు మెరుగుపడి రెండో ర్యాంక్‌లోకి దూసుకొచ్చింది. అయితే స్మృతి కంటే ఈమె వంద రేటింగ్ పాయింట్లు తక్కువగా ఉంది. రెండు ప్లేస్‌లు ఎగబాకిన లారా వోల్‌వార్ట్ (716) మూడో ర్యాంక్‌లో నిలిచింది. సివర్ బ్రంట్ (711), బెత్ మూనీ (709) చెరో రెండు ప్లేస్‌లు దిగజారి నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.
ఇండియా బ్యాటర్ ప్రతీకా రావల్ (564).. 27వ ర్యాంక్‌ను సాధించింది. బౌలింగ్‌లో ఇండియా స్పిన్నర్ దీప్తి శర్మ (655) రెండు ప్లేస్‌లు మెరుగుపడి ఐదో ర్యాంక్‌ను సాధించింది. సోఫీ ఎకిల్‌స్టోన్ (747), అలనా కింగ్ (698), ఆష్లే గార్డ్‌నర్ (689), మరిజానె కాప్ (676) టాప్–4లో కొనసాగుతున్నారు. రేణుకా సింగ్ (548), స్నేహ్ రాణా (508), క్రాంతి గౌడ్ (491) వరుసగా 19, 23, 25వ ర్యాంక్‌ల్లో ఉన్నారు.
