నత్త సబ్బులతో రోగాలు నయం

నత్త సబ్బులతో రోగాలు నయం

ఫ్రాన్స్​లో ఇప్పుడు అందరూ వేటి గురించి మాట్లాడుకుంటున్నారో తెలుసా.. నత్తల గురించి. టైం కానీ టైంలో ఈ నత్తలు ఎందుకు వచ్చాయి అనుకుంటున్నారా? నత్తల జిగురుతో సబ్బులు తయారుచేస్తున్నారు ఫ్రాన్స్​ సైంటిస్టులు.  ఈ సబ్బులతో   స్కిన్​ అలర్జీలు రావని అంటున్నారు.  శరీరంపై ముడతలు పడకుండా ఈ సబ్బులు అద్భుతంగా పనిచేస్తాయంటున్నారు రీసెర్చర్లు. 2020లో ఫ్రాన్స్‌‌లో  అరవై వేల నత్తల నుంచి జిగురును సేకరించారు.  
దీనిపై పరిశోధనలు జరిపారు.  ఆ జిగురుతో  సబ్బులు తయారు చేశారు.  నలభై నత్తల నుంచి ఒక సబ్బు తయారవుతోంది.  నత్త  జిగురులో కొల్లాజెన్, ఎలాస్టిన్ అనే పదార్థాలున్నాయి.  ఇవి  శరీరంపై గాయాలను నయం చేస్తున్నాయి.  చర్మానికి వచ్చే రోగాలను  పోగొట్టే శక్తి ఈ సబ్బులకు ఉంటుందన్నారు ఫ్రాన్స్‌‌లో డామిన్ డెస్రోచెర్ అనే సైంటిస్ట్.  ఆయన నత్తల కోసం ప్రత్యేకంగా ఒక ఫామ్​ను కూడా ఏర్పాటు చేశాడు.  మరోవైపు నత్తల జిగురు పై కాస్మొటిక్ కంపెనీలు ఫోకస్ పెట్టాయి. అవి మన వరకూ వస్తాయో లేదో చూడాల్సిందే!