రాజధాని రైలులో పాము హల్ చల్..ప్రయాణికుల పరుగులు.. పట్టుకొని బయటపడేసిన సిబ్బంది

రాజధాని రైలులో పాము హల్ చల్..ప్రయాణికుల పరుగులు.. పట్టుకొని బయటపడేసిన సిబ్బంది

పాములు ఇండ్లలోకి రావడం అప్పుడప్పుడు చూస్తుంటాం..వానకాలం వర్షాలు పడే టైంలోనో లేక చలికాలంలోనో పాములు జనవాసాల్లోకి దర్శనమిస్తుంటాయి. వాటిని చూసి మనం పరుగులు పెడతాం. అడవులు,చెత్తాచెదారం ప్రాంతాల్లో కూడా పాములు తిరగడం సహజం..కానీ రైలులో పాములు తిరగడం చూశారా?..అదీ ఏకంగా ఏసీ బోగీలో..రైలులో పాము ప్రత్యక్షమవడం ఎప్పుడైనా చూశారా? పాము సరదా రైలు ప్రయాణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

కదులుతున్న ఎక్స్ ప్రెస్ రైలు  బోగీలోని టాయిలెట్ దగ్గర పాము కనిపించింది. రైల్వే సిబ్బంది రంగంలోకి దిగి పామును సురక్షితంగా పట్టుకొని బయటికి పడేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ జర్నలిస్టు ఇంటర్నెట్ లో షేర్ చేశారు. ఈ వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  దిబ్రుగఢ్ రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు టాయిలెట్ లోపల పాము కనిపించింది. వేగంగా వెళ్తున్న రైలు టాయిలెట్ లోకి ప్రమాదకరమైన పాము రావడంతో అదిచూసిన ప్రయాణికులు షాక్ గురయ్యారు. భయంతో పరుగులు పెట్టారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రైలులోకి పాము ఎలా పాకుతూ వచ్చింది అని అనుమానం వ్యక్తం చేస్తూ పోస్టులు షేర్ చేశారు.   

వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఇంటర్నెట్ యూజర్లు ఫన్నీ కామెంట్లతో ముంచెత్తారు.

 ఓ నెటిజన్ ఇలా రాశారు.‘‘టికెట్ లేకుండా ప్రయాణం.. అందులో ఏసీ బోగీలో ప్రయాణించినందుకు ముందు టీసీని పిలిపించి పాముకు ఫైన్ వేయాల్సి ఉండేది..అంతేకాదు ప్రయాణికులను ఇబ్బంది పెట్టింది.’’ అని ఫన్నీగా కామెంట్ చేశారు. 

►ALSO READ | చెన్నై హోటల్లో సినీ ఫక్కీలో చోరీ.. రూ.23కోట్ల విలువైన వజ్రం కొట్టేసిన దొంగలు

మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ అదీ బీహార్ పాము అయి వుంటుంది.. అందుకే టికెట్ లేకుండా టాయిలెట్ లో ప్రయాణిస్తుందని ’’ కామెంట్ చేశారు. 

మరో యూజన్ స్పందిస్తూ.. ‘‘ ముందు రైల్వే సిబ్బంది డేరింగ్ పర్మార్మెన్స్ ను మెచ్చుకోవాలి.. గ్రేట్ జాబ్ ..రైల్వే బోర్డుకు ధన్యవాదాలు అని పోస్ట్ షేర్ చేశారు.