కొత్త ఫీచర్ తీసుకొచ్చిన స్నాప్ చాట్

కొత్త ఫీచర్ తీసుకొచ్చిన స్నాప్ చాట్

కొత్త ట్రెండ్ సెట్ చేసిన స్నాప్ చాట్ ఇప్పుడు వినియోగదారుల కోసం కొత్త అప్ డేట్ తీసుకొచ్చింది. ఇదివరకు మొబైల్ కే పరిమితమైన స్నాప్ చాట్ ఇప్పటి నుంచి కంప్యూటర్ (మైక్రోసాఫ్ట్ విండోస్)లో కూడా వాడుకోవచ్చు. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లాగా స్నాప్ చాట్ బ్రౌజ్ చేయొచ్చు. వెబ్ వాట్సాప్ తరహాలో లాగిన్ అయి వాడుకోవచ్చు.

ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే.. గూగుల్ లో వెబ్ స్నాప్ చాట్ అని సెర్చ్ చేసి వెబ్ వాట్సాప్ తరహాలో కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. లేదంటే ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లా లాగిన్ అయ్యి ఉపయోగించుకోవచ్చు. అయితే.. ఈ కొత్త ఫీచర్ తో కంప్యూటర్ లో వీడియో కాల్, ఆడియో కాల్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే కంప్యూటర్ కు కెమెరా, మైక్రోఫోన్ యాక్సెస్ ఉండాలి.