స్నాప్ చాట్ సోలార్ సిస్టమ్ అంటే ఏమిటీ.. టీనేజర్లకు ఎందుకు ప్రమాకరం..

స్నాప్ చాట్ సోలార్ సిస్టమ్ అంటే ఏమిటీ.. టీనేజర్లకు ఎందుకు ప్రమాకరం..

ఫొటో షేరింగ్ ఫ్లాట్ ఫాం అయిన స్నాప్ చాట్ వినియోగదారులకోసం 2022లో ఫ్రెండ్స్ సోలార్ సిస్టమ్ అనే కొత్త ఫీచర్ ను పరిచయం చేసింది. ఇది దాని ప్రీమియం స్నాప్ చాట్ + వినియోగదారులకోసం ప్రత్యేకంగా రూపొందించింది. ఈ ఫీచర్ ద్వారా Snapchat + సబ్ స్క్రైబ్ చేసుకునేలా  వినియోగదారులు ఆకర్షించేందుకు ప్రయత్నించింది. ఫ్రెండ్ షిప్ ను గేమిఫైచేయడం ద్వారా వారిమధ్య స్నేహ సంబంధాలను మెరుగుపర్చేందుకు ఫ్రెండ్స్ సోలార్ సిస్టమ్స్ ఫిచర్ ను రూపొందించింది. అయితే ఈ ఫీచర్ పెద్ద దుమారమే రేపింది. ఈ ఫీచర్ చాలా ప్రమాదకరం అంటూ టీనేజర్లనుంచి చాలా కంప్లెయింట్ వచ్చాయి. ప్రస్తుత ఈ ఫీచర్ ను హోల్డ్ లో ఉంచారు.. టీనేజర్లకు ఎందుకు ప్రమాదకరం ఎందుకు దీనిని టీనేజర్లు వ్యతిరేకిస్తున్నారో తెలుసుకుందాం.. 

స్నాప్ చాట్ సోలార్ సిస్టమ్ అనేది Snapchat+  ఫీచర్. ఇది యాప్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ సర్వీస్..స్నాప్ చాట్ సోలార్ సిస్టమ్ అనేది మీరు ఒకరి బెస్ట్ ఫ్రెండ్ ఉండటానికి ఎంత దూరంలో ఉన్నారో తెలిపే మార్గం. మీరు ఒక వ్యక్తితో తరుచుగా మాట్లాడుతున్నారో దాని ఆధారంగా ఫ్లాట్ ఫారంలో Snapchat  మీ మంచి స్నేహితులను నిర్ణయిస్తుంది. ప్రతి రోజు మేసేజ్ పంపుతూ ఉంటే.. మీరు ఈ ర్యాంకింగ్ లో ఉన్నతస్థానంలో ఉంటారు బెస్ట్ ఫ్రెండ్ స్థానం పొందుతారు. 

Snapchat లో మొత్తం ఎనిమిది మంది స్నేహితులను చూపుతుంది. అంటే సోలార్ వ్యవస్థలో సూర్యుడు, గ్రహాల మాదిరిగా.. ప్రతి స్నేహితుడిని సౌర వ్యవస్థలోని గ్రహాల లో ఒకదానిని సూచిస్తాడు. వినియోగదారులు స్వయంగా సూర్యుడిగా సూచించబడతాడు. మీ బెస్ట్ ఫ్రెండ్ ని అతి దగ్గర ఉంటే గ్రహంతో సూచించబడతారు. 

ఫీచర్ ఎలా పనిచేస్తుంది 

ఫీచర్ ని యాక్సెస్ చేయాలంటే మీరు యూజర్ ప్రొఫైల్ లోకి వెళ్లాలి. మీరు ఒకరి ఫ్రెండ్స్ సోలార్ సిస్టమ్ ని చూసినపుడు మీరు ఏగ్రహం పై ఉన్నారో చూపుతుంది.. అంటే అతని ప్రెండ్స్ లిస్టులో మీ స్థానాన్ని సూచిస్తుంది. మీరు వారి బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరు అయితే మీకు బెస్ట్ ఫ్రెండ్ బటన్ కనిపిస్తుంది. చుట్టూ బంగారం ఉంగరం ఉన్న బటన్ ను నొక్కితే స్క్రాన్ దిగువన చిన్న ప్యానెల్ పాప్ అప్ ని కనిపిస్తారు. ఇది మీరు స్నేహితుడిని సూర్యునిగా , గ్రహాలలో ఒకదానిపై మీ ఫొటోను చూపుతుంది. మీ అవతార్ కూర్చున్న గ్రహం మీరు ఏ ర్యాంక్ లో ఉన్నారో తెలియజేస్తుంది. మీరు మెర్క్యూరి మీద ఉన్నట్లయితే బెస్ట్ ఫ్రెండ్ అని.. నెప్ట్యూన్ మీద ఉన్నట్లయితే ఎనిమిదో స్థానం అన్నమాట. మీరు ప్లాట్ ఫారమ్ లో మీ బెస్ట్ ఫ్రెండ్స్ తో ఎలా నిలబడాలనే దానిపై మీకు ఎప్పుడైనా ఆసక్తి ఉంటే..Snapchat  లో విషయాలను ఆసక్తికరంగా ఉంచడానికి ఇది ఒక సరదా ఫీచర్. 

ఈ ఫీచర్ పై టీనేజర్ల ఆందోళన ఎందుకంటే.. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే టీనేజర్ల కోసం ఫ్రెండ్స్ సోలార్ సిస్టమ్స్ ఫీచర్ ను అందుబాటులో తెచ్చారు. ఇది వారి స్నేహితులతో ఫ్రెండ్ షిప్ ఏ స్థాయిలో  ఉందోర్యాంకింగ్ ల ద్వారా చూపుతుంది. దీంతో టీనేజర్లు ఆందోళన చెందుతున్నారు. 

ముఖ్యంగా ప్రేమలో ఉన్న వారిలో ఆందోళన ఎక్కువగా ఉంది. ఎందుకు వారి క్రష్ తో ఫ్రెండ్ షిప్ ర్యాంకింత్ పడిపోతే .. వారి మధ్య విబేధాలు రావడం జరుగుతుంది. అంతేకాదు బెస్ట్ ఫ్రెండ్ మధ్య కూడా దూరం పెరిగే అవకాశం ఉందని ఒత్తిడితో ఈ ఫీచర్ ను వ్యతిరేకిస్తున్నారట. ఈ ఫీచర్ యూత్ నిజజీవితంలో కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు.ఇది వారి మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుందంటున్నారు. స్నాప్ చాట్ లో M y AI పేరుతో ఉన్న AI చాట్ బాట్ కు టీనేజ్ యువకులు అసభ్యకరమైన మేసేజ్ లను జోడించే అవకాశం ఉందని అంటున్నారు.