ఒక్క రోజంతా మొక్కల్లో ఇన్ని మార్పులా ?.. వాటి ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే ఆశ్చర్యపోతారు !

  ఒక్క రోజంతా మొక్కల్లో  ఇన్ని మార్పులా ?.. వాటి ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే ఆశ్చర్యపోతారు !

పొద్దుపొద్దునే ఉండే జోష్ ఆ తరువాత నెమ్మదిగా తగ్గుతుంటుంది. గడియారం ముల్లు పదకొండుదాటంగనే కాస్త నీరసంగా అయిపోతుంటారు. లంచ్ టైంలో కడుపులో కాస్త ఫుడ్ పడ్డాక మళ్లీ యాక్టివ్ అయిపోతారు. తిరిగి ఈవెనింగ్ నాలుగైదుకల్లా ముఖంలో ఫ్రెష్ నెస్ తగ్గిపోతుంది.

ఈవెనింగ్ ఆరుదాటితే డల్ నెస్ అంతా ముఖంలోనే కనిపిస్తుంది. ఇది రెగ్యులర్ లైఫ్ మనుషుల్లో గమనించే మార్పులే. అయితే ఇలా మనుషులే కాదు... మొక్కలు కూడా టైం పీరియడ్ నిబట్టి మారిపోతుంటాయి. దాన్ని ప్రూవ్ చేస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 

ఉదయం నుంచి రాత్రి వరకు మొక్కల ఎనర్జీని ఓ వీడియో రూపంలో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు మిలోరా అనే ఓ ట్విట్టర్ యూజర్. కాలాన్ని బట్టి మారుతున్న మొక్కల ఎక్స్ప్రెషన్స్ ని   నెటిజన్స్ తెగ చూసేస్తున్నారు. ఇప్పటికే ఈ పన్నెండు సెకన్ల వీడియోకి 86 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో కి ఇవాంకా ట్రంప్ కూడా ఇంప్రెస్ అయ్యింది.