
హీరోయిన్ శోభితా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్తో తన భర్త నాగ చైతన్యతో సహా అందరి దృష్టిని ఆకర్షించింది. శోభితా నెక్స్ట్ ప్రాజెక్ట్ సెట్స్ నుండి తన వంట నైపుణ్యాలను ప్రదర్శించింది. ఈ పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే..
అక్కినేని వారి ఇంటి కోడలు శోభితా మంగళవారం (సెప్టెంబర్ 2న) తాను వంట చేస్తూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ తన వంట స్కిల్స్ను పంచుకుంది. పప్పు మరియు కూరగాయలను పెద్ద మొత్తంలో కలుపుతూ తన వంట నైపుణ్యాలను చూపించింది.
ఒక వీడియోలో ఆమె తాను చేసిన పప్పు సాంబార్ను చూపిస్తూ టేస్టీ వావ్ అంటూ కనిపించింది. మరొక వీడియోలో బెండకాయలను తరగడం చూడొచ్చు. అయితే, మరి ముఖ్యంగా, తన చేసిన వంటను నాగచైతన్యకు చూపించాలని డిసైడ్ అయినట్లుగా ఈ పోస్ట్ పెట్టింది.
గతంలో వోగ్ ఇండియాతో మాట్లాడుతూ చైతన్య, శోభిత తమ వంట స్కిల్స్ పంచుకున్నారు. మీ ఇద్దరిలో ఎవరికీ వంట బాగొచ్చు? అనే ప్రశ్నకు సమాధానంగా చై ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పారు. అందులో చైతన్య స్పందిస్తూ తమ ఇద్దరికీ వంట సరిగా చేయడం రాదని తెలిపారు. మరీ ముఖ్యంగా శోభితకు వంటకు సంబంధించిన బేసిక్ హ్యూమన్ స్కిల్స్ లేవంటూ కామెంట్ చేశాడు.
ఇందులో భాగంగానే లేటెస్ట్గా శోభితా తన వంట స్కిల్స్ను పంచుకుంది. తన భర్త చైతన్య చేసిన కామెంట్స్ను గుర్తుకుతెచ్చేలా ఆ ఫోటోలకు "#basichumanskills #lol #IYKYK #BTS #SetLife" అనే హ్యాష్‌ట్యాగ్స్నే క్యాప్షన్గా ఇచ్చింది.
►ALSO READ | సూర్యకు జోడీగా నజ్రియా నజీమ్..
ఈ క్రమంలోనే నాగచైతన్య తనదైన చమత్కరంతో "ఈ స్కిల్స్ ఆస్వాదించేందుకు వెయిట్ చేస్తున్నాను" అని క్యూట్ రిప్లై ఇచ్చారు. దాంతో వీరిద్దరి ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తూ.. భలేగా ఉంది మీ వంట స్కిల్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. నాగచైతన్య, శోభితల వివాహం 2024 డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది. పెళ్లి తర్వాతే తండేల్ మూవీతో వచ్చి వందకోట్ల క్లబ్లో చేరాడు చైతన్య. ప్రస్తుతం చైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు డైరెక్షన్లో ఓ మైథికల్ థ్రిల్లర్లో నటిస్తున్నారు. ఇందులో నిధి అన్వేషకుడిగా కనిపించనున్నాడు. తన పాత్ర కోసం ఫిజికల్‌గా, మెంటల్‌గా కంప్లీట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యాడు. త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.