Xకు ఎలక్షన్ కమీషన్ షాక్.. కొన్ని పొలిటికల్ పోస్టులు బ్యాన్ చేయాలని ఆదేశం

Xకు ఎలక్షన్ కమీషన్ షాక్.. కొన్ని పొలిటికల్ పోస్టులు బ్యాన్ చేయాలని ఆదేశం

ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంకు భారత ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో గెలిచిన రాజకీయ నాయకుల, పార్టీల స్పీచ్ లు, పోస్టులు భారత్ లో పబ్లిష్ చేయకూడదని ఎక్స్ ఫ్లాట్ ఫాంను ఎలక్షన్ కమీషన్ ఆదేశించింది. ఈమేరకు ఎన్నికల సంఘం ఆంక్షలతో కొన్ని పోస్టులకు నిలిపివేస్తున్నట్లు మంగళవారం ఎక్స్ తెలిపింది. అయితే దీనిపై ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ స్పందిస్తూ ఎలక్షన్ కమీషన్ ఆదేశాలను ఏకీభవించడం లేదని అన్నారు. పలు మార్లు ఇలా భారత్, ఎలక్షన్ కమీషన్ ఆంక్షలు విధించడాన్ని  తాము విభేదిస్తున్నట్లు ఎక్స్ తెలిపింది. ఈ ఆంక్షలను ఎత్తివేయాలని X కోరుతుంది.