హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దారుణ హత్య

హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దారుణ హత్య

హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురైంది. నగరంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సాయి అనురాగ్ కాలనీలో కుటుంబ కలహాలతో సాప్ట్ వేర్ ఇంజనీర్ అయిన మధులతను భర్త నాగేంద్ర భరద్వాజ్ దారుణంగా హత్య చేశాడు. తర్వాత గ్యాస్ లీకేజ్ చేసి ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేశాడు.

మృతురాలి తండ్రి రంగనాయకులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈనెల 5 తేదీన ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరిలించారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.