2 నెలల్లో పెళ్లి..ఇంతలోనే జిమ్ కెళ్లి కుప్పకూలిన సాఫ్ట్వేర్

2 నెలల్లో పెళ్లి..ఇంతలోనే  జిమ్ కెళ్లి కుప్పకూలిన సాఫ్ట్వేర్

ఈ మధ్య గుండెపోటు ఘటనలు ఆందోళనలు కల్గిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా వస్తున్న  హార్ట్ ఎటాక్  ఘటనలు కుటుంబాలను ఆగం చేస్తున్నాయి. ఉన్నచోటే ఉన్నట్టుండి క్షణాల్లోనే ప్రాణాలు వదుల్తున్నారు. హైదరాబాద్ లో  రెండు రోజుల క్రితమే జిమ్ లో కానిస్టేబుల్ గుండెపోటుతో మరణించిన ఘటన మరువకముందే ఏపీలో ని కర్నూలు జిల్లా ఆదోనిలోనూ ఇలాంటి ఘటనే జరిగింది.

ఆదోనిలో సాయప్రభు(28) అనే సాప్ట్ వేర్ ఇంజినీర్ కొన్ని రోజుల నుంచి వర్క్ ఫ్రమ్ హోం వల్ల  ఇంటి దగ్గరే ఉంటున్నాడు. శనివారం ఉదయం  జిమ్ లో వ్యాయామం చేసి బయటకు రాగానే  కిందపడిపోయాడు. స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తరలించగా..అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు  డాక్టర్లు చెప్పారు.  అతనికి మే 3న పెళ్లి నిశ్చయించారు. ఇంతలోనే ఇలా జరగడంతో  కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.