Viral News: నాకు జూనియర్ భార్య కావాలి.. సోషల్ మీడియాలో సాఫ్ట్ వేర్ ఇంజనీరు పోస్ట్ వైరల్

Viral News: నాకు జూనియర్ భార్య కావాలి.. సోషల్ మీడియాలో  సాఫ్ట్ వేర్ ఇంజనీరు  పోస్ట్ వైరల్

ఈ మధ్య కాలంలో జనాలు సోషల్ మీడియాను పిచ్చి పిచ్చిగా వాడేస్తున్నారు.  స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్లు వింత వింత పోస్ట్లు పెడుతూ జనాలను షాక్ ఇస్తున్నారు..  ఏ రేంజ్ లో అంటే  వింత వింత యాడ్ లు మతి పోగొడుతున్నారు. సాఫ్ట్ వేర్ జూనియర్ భార్య కావాలి అంటూ ఓ ప్రొఫెషనల్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశాడు. ఇలా ఎందుకు పోస్ట్ చేయాల్సి వచ్చిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…

 కొంతమంది బాగా పాపులర్ అయ్యేందుకు సోషల్ మీడియాను అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. ఇంకొంతమంది జనాలకు షాకింగ్ ఇచ్చే రేంజ్ లో పోస్టులు పెడుతున్నారు.  ఇప్పుడు తాజాగా ఓ సాప్ట్ వేర్ ఇంజనీరు పెట్టిన పోస్ట్ వైరల్ అయింది.  తనకు భార్యగా అమ్మాయి కావాలని.. ఆ అమ్మాయికి ఉండాల్సిన అర్హతల గురించి పోస్ట్ పెట్టాడు.ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

 సాఫ్ట్ వేర్ జూనియర్ భార్య కావాలి అంటూ ఓ ప్రొఫెషనల్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశాడు. అతను భార్య కోసం  లింక్డిన్ వెబ్ సైట్ లో పోస్ట్ చేశాడు. అతని కోరికల గురించి ఆ పోస్ట్ లో రాసుకొచ్చాడు.. అందులో ఏమి రాశాడంటే..నేను కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నా.. నా జీవితానికి జూనియర్ భార్య కోసం చూస్తున్నాను .. అనుభవజ్ఞులైన అభ్యర్థులు ఈ పోస్టుకు అర్హులు కారు.. ఎటువంటి అనుభవం లేని వారు మాత్రమే నాకు కావాలి.. కొన్ని ఇంటర్వ్యూల తర్వాత చివరగా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. అలాగే , వంటలో రెండేళ్ల అనుభవం ఉండాలని, రాత్రిపూట మేల్కొని నాకు నచ్చిన వాటిని చేసే పెట్టే సామర్థ్యం ఉండాలని పోస్టులో రాసాడు.. అది చూసిన అమ్మాయిలు షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు.. నెటిజన్లు రకరకాల కామెంట్స్ తో మరింత వైరల్ చేస్తున్నారు..