‘తెలుసు కదా’ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్.. ‘సొగసు చూడతరమా’ అంటూ సాగిన పాట

‘తెలుసు కదా’ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్.. ‘సొగసు చూడతరమా’ అంటూ సాగిన పాట

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తెలుసు కదా’.  ప్రముఖ స్టైలిస్ట్  నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతోంది. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ చిత్రం నుంచి ‘సొగసు చూడతరమా’ అంటూ సాగే రెండో  పాటను  హీరోయిన్ నయనతార రిలీజ్ చేసి టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సాంగ్ కంపోజ్ చేయడంతో పాటు కొన్ని సీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తూ స్పెషల్ అట్రాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు.

‘ఎప్పుడూ  ఇలా లేదుగా మరి.. కొత్తగా కలలు కలిసి రాగా,  ఉప్పెనే అమాయకంగా.. అమ్మాయిలాగా ఎదురుపడుతు రాగా..’ అంటూ సాగిన పాటలో సిద్ధు, శ్రీనిధి శెట్టి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది.  ‘హే సొగసు చూడతరమా.. చాలదే సమయపగలమా.. ఏమిటో సులువు కాదులేమా.. మళ్లీ మళ్లీ పడ్డాను ఈ చోటే.. మళ్లీ మళ్లీ పడ్డాను నీ బాటే..’ అంటూ  కృష్ణకాంత్ క్యాచీ  లిరిక్స్ అందించగా, కార్తీక్, అద్వితీయ వొజ్జల కలిసి పాడారు. ఇందులోని విజువల్స్, హీరో హీరోయిన్ స్టైలిష్ లుక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంప్రెస్ చేస్తున్నాయి. అక్టోబర్ 17న దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.