పాత పర్మిషన్లతో మట్టి దందా!.. కేటాయించింది ఓ చోట.. తవ్వకాలు మరోచోట

పాత పర్మిషన్లతో మట్టి దందా!.. కేటాయించింది ఓ చోట.. తవ్వకాలు మరోచోట
  •     జగిత్యాల జిల్లాలో రెచ్చి పోతున్న మట్టి మాఫియా 
  •     కళ్లు మూసుకున్న ఆఫీసర్లు  
  •      తాజాగా ఎమ్మెల్యే అడ్లూరి ఆదేశాలతో దాడులు 

జగిత్యాల, వెలుగు:  జగిత్యాల జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఏకంగా గుట్టలను మాయం చేస్తూ సహజ వనరులను కొల్లగొడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పర్మిషన్లతో మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. అనుమతుల పేరు చెప్పి కేటాయించిన చోటకాకుండా మరోచోట తవ్వకాలు చేపడుతున్నారు. రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  పనిలేకుండా పగలు రాత్రీ టన్నుల కొద్దీ మట్టిని తరలిస్తున్నారు. ఈ దందాలో కొందరు ఆఫీసర్లకు వాటాలు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.  మట్టి దందా ఆగడాలపై ప్రజలు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  దృష్టికి తీసుకుపోవడంతో ఆయన ఆదేశాల మేరకు ఆఫీసర్లు కొన్ని డంపులు సీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.  ఈ క్రమంలో రెవెన్యూ, పోలీస్ ఆఫీసర్లు దాడులు నిర్వహించి అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తున్నారు.

విచ్చలవిడిగా తవ్వకాలు 

జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్ మండలం కప్పారావుపేట, మల్యాల, గొల్లపల్లి, కోరుట్ల, మెట్ పల్లి, ఇబ్రహీం పట్నం, జగిత్యాల రూరల్ మండలం కల్లెడ, నర్సింగాపూర్, జాబితాపూర్, లక్ష్మీపూర్ తదితర ప్రాంతాల్లో అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కొందరు లీడర్లు మట్టి తవ్వకాలకు పర్మిషన్లు పొందారు.

అప్పటి నుంచి ఈ తవ్వకాలు సాగుతున్నాయి. అయితే పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొందిన చోటకాకుండా ఇష్టారీతిన తవ్వకాలు చేపట్టినట్లు విమర్శలు ఉన్నాయి. మరికొన్నిచోట్ల పరిమితికి మించి మట్టి తవ్వి తరలిస్తూ పట్టుబడిన ఘటనలూ ఉన్నాయి. అక్రమంగా తవ్వకాలు జరుగుతుండడంతో రాయల్టీ రూపంలో సర్కార్​ ఖజానాకు రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నట్లు తెలుస్తోంది. సొంత భూమిలో మట్టి తవ్వకాలు చేయాలన్నా పర్మిషన్​ తీసుకోవాలని రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడే ఆఫీసర్లు ఏకంగా గుట్టలు మాయమవుతున్నా చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆఫీసర్లు లంచాలకు అలవాటు పడడంతో ఏకంగా కీలక నేతలు ఆదేశాలు ఇచ్చేదాకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. 

21 టిప్పర్లు, జేసీబీ సీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కీలక నేతల ఆదేశాలతో ఆఫీసర్లు మట్టి తోలకాలపై ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టారు. ఈ నెల 3న వెల్గటూర్ మండలం కప్పాట్రావ్ పేట  గ్రామ శివారులో అక్రమంగా నిల్వ చేసిన చెరువు మట్టి డంపులపై రెవెన్యూ, పోలీసు ఆఫీసర్లు దాడులు చేశారు. బీఆర్ఎస్ హయాంలో కొందరు లీడర్లు చెరువుల్లోంచి ఈ మట్టిని డంప్​ చేసినట్లు స్థానికులు విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్ల దాడులు నిర్వహించి 11 లారీలు, జేసీబీ సీజ్ చేసి కేసులు పెట్టారు. ఈ నెల 15న మల్యాల మండలం బల్వంతాపూర్ శివారులోని  రేగుల చెరువు నుంచి మట్టి తరలింపునకు యత్నించిన 10 టిప్పర్లను సీజ్ చేశారు. వాటికి జరిమానా కూడా విధించారు.