రేపే తొలి సూర్య గ్రహణం

రేపే తొలి సూర్య గ్రహణం

న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశంలో తొలి సూర్య గ్రహణం గురువారం ఏర్పడనుంది. పాక్షికంగా ఏర్పడనున్న ఈ గ్రహణం.. సూర్యాస్తమయానికి కొన్ని నిమిషాల ముందు లడఖ్, అరుణాచల్ ప్రదేశ్‌‌ల్లో కనిపించనుంది. ఈ రెండు ప్రాంతాల్లో మినహా దేశంలోని మరే ప్రాంతంలోనూ ఈ గ్రహణాన్ని చూడలేం. భారత్‌లో పాక్షికంగా కనిపించినప్పటికీ ఉత్తర అమెరికా, యూరప్, ఆసియాల్లోని కొన్ని ప్రాంతాల్లో గ్రహణం స్పష్టంగా కనిపించనుంది. కెనడా, గ్రీన్‌లాండ్, రష్యా దేశాల్లోనూ స్పష్టంగా కనిపిస్తుందని నాసా తెలిపింది. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, లండన్, టొరంటో వంటి నగరాల్లో గ్రహణం ప్రభావం పాక్షికంగా ఉంటుంది. ఇతర ప్రాంతాల ప్రజలు లైవ్ వెబ్‌క్యామ్ ద్వారా చూడవచ్చు. ఈ అరుదైన గ్రహణాన్ని రక్షణ కల్పించే కళ్లద్దాలతో మాత్రమే చూడాలని స్పేస్ సైంటిస్టులు తెలిపారు. ఈ గ్రహణం భారత కాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం 1.42కు మొదలై  సాయంత్రం 6.41 గంటలకు ముగుస్తుంది.