
బెంగళూరులో గర్భవతి అయిన ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. దింతో ఆమె భర్తే అదనపు కట్నం కోసం వేధించి, హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. చివరికి పోలీసులు అతడిని అరెస్టు చేయగా, అతను గతంలో సాఫ్ట్ వేర్ టెక్కీగా పనిచేసి, ప్రస్తుతం పానీ పూరీ బిజినెస్ నడుపుతున్నాడు.
వివరాలు చూస్తే గతంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆయిన్ ప్రవీణ్, టెక్కీగా పనిచేస్తున్న 27 ఏళ్ల శిల్పా పంచాంగమాతని 2022లో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకి 2 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే శిల్పా మరణించే సమయానికి ఆమె గర్భవతి. పెళ్ళికి ముందు ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేశారు. అయితే వీరు పెళ్లి చేసుకున్న ఒక సంవత్సరం తర్వాత ప్రవీణ్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలి పానీ పూరీ వ్యాపారం ప్రారంభించాడు, శిల్ప కూడా కొడుకు పుట్టిన తర్వాత ఉద్యోగాన్ని విడిచిపెట్టింది.
అయితే గత బుధవారం మొదట శిల్ప ఇంట్లో గుండెపోటుతో చనిపోయిందని తరువాత కొద్దిసేపటికి ఆత్మహత్య చేసుకుందని ప్రవీణ్ తనతో చెప్పినట్లు శిల్ప తల్లి శారద, సోదరి సౌమ్య ఆరోపించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే ప్రవీణ్, అతని కుటుంబ సభ్యులు శిల్ప మృతదేహాన్ని మంచంపై పడుకోబెట్టారని శిల్ప తల్లి చెప్పగా, ఆమె చనిపోయిన పరిస్థితులను ప్రశ్నిస్తూ ప్రవీణ్ ఇంకా అతని తల్లి కలిసి శిల్పని హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు.
శారద ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు ప్రవీణ్‌పై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 80 (కట్నం మరణం), వరకట్న నిషేధ చట్టం, 1961లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
►ALSO READ | Viral news:యూపీలో షోలే సీన్ రిపీట్..మరదలిని మూడో పెళ్లి చేసుకుంటానంటూ..విద్యుత్ టవర్ ఎక్కిన యువకుడు
శిల్పతో ప్రవీణ్ పెళ్లికి 15 తులాల బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చానని శారద తన ఫిర్యాదులో పేర్కొంది. ప్రవీణ్ తల్లి శాంతవ్వ కూడా తన కూతురిని వేధిస్తూ, ఆమెని ఎప్పుడు అవమానించేదని, ఈ హింసను భరించలేకే శిల్ప నాలుగు నెలల క్రితం మా ఇంటికి వచ్చిందిని, కానీ మేము శిల్పకి ప్రవీణ్, అతని కుటుంబంతో కలిసి ఉండాలని చెప్పి తిరిగి పంపించామని అలాగే ఒకసారి శిల్ప ప్రవీణ్ ఇంటికి వెళ్లేటప్పుడు ఆమెకు 5 లక్షల డబ్బు కూడా ఇచ్చి పంపించానని శారద తన ఫిర్యాదులో తెలిపింది.
ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటే, పోలీసులు రాకముందే ఆమె మృతదేహాన్ని ఎందుకు తీశారు, మరి మొదట్లో గుండెపోటు అని ఎందుకు అన్నారు ? ముందుగానే ప్లాన్ చేసి హత్య చేసారు అని శిల్ప బంధువు ప్రశ్నించారు. శిల్ప అత్తగారు ఆమెని ఎప్పుడు బాడీ షేమింగ్ చేసేదని, ఎక్కువ డబ్బు డిమాండ్ చేసేదని శిల్ప చెల్లె సౌమ్య వివరించారు.