
న్యూఢిల్లీ: ప్రస్తుత సంవత్సరం జనవరి–-జూన్ కాలంలో దేశంలో రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్‌లు 3.2 శాతం పెరిగి 872 మెగావాట్లకు చేరుకున్నాయని మెర్కామ్ ఇండియా తెలిపింది. 2022 మొదటి అర్ధభాగంలో (హెచ్1) భారతదేశంలో 845 మెగావాట్ల సోలార్ రూఫ్‌టాప్ ఇన్‌స్టాలేషన్‌లు పూర్తయ్యాయని ఈ పరిశోధనా సంస్థ వెల్లడించింది. క్యుములేటివ్ రూఫ్‌టాప్ సోలార్ కెపాసిటీ జూన్ 2023 చివరి నాటికి 9.6 గిగావాట్లకు చేరుకుందని మెర్‌కామ్ రిపోర్ట్ పేర్కొంది. రెండవ క్వార్టర్లో 387 మెగావాట్ల రూఫ్టాప్ఇన్స్టాలేషన్లు పూర్తయ్యాయి. ఇది ఈ ఏడాది జనవరి–-మార్చితో పోలిస్తే 20 శాతం ఎక్కువ. గత ఏప్రిల్–-జూన్ కంటే 0.5 శాతం తగ్గింది. "రూఫ్‌టాప్ సోలార్ ఇండస్ట్రీ హెచ్1లో అంచనాలను అందుకోలేకపోయింది.
డిమాండ్ పెరిగినప్పటికీ ధరలు పెరిగినప్పటికీ ఇలా జరిగింది. హెచ్2లో మాత్రం మెరుగైన మార్జిన్‌ల కోసం ఇన్‌స్టాలర్లు ఇన్‌స్టాలేషన్‌లను పెంచారు. చాలా వేగంగా డిమాండ్‌ను అందుకున్నారు " అని మెర్కామ్ క్యాపిటల్ గ్రూప్ సీఈఓ రాజ్ ప్రభు అన్నారు. రెసిడెన్షియల్ కన్జూమర్ల ఇన్‌స్టాలేషన్‌లు 54 శాతం, పారిశ్రామిక వినియోగదారులవి 25 శాతం, వాణిజ్య వినియోగదారులవి 21 శాతం ఉన్నాయి. ప్రధానంగా ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్, ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ , ఆటోమొబైల్ ఆటో కాంపోనెంట్ సెక్టార్‌లలో ఇండస్ట్రియల్ ఇన్‌స్టాలేషన్‌లు ఎక్కువగా ఉన్నాయి. క్యుములేటివ్ రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్‌లలో గుజరాత్ మొదటిస్థానంలో ఉంది. మహారాష్ట్ర రాజస్థాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని మెర్కామ్ తెలిపింది.