కొన్ని దేశాలకు కరోనా డేంజర్ బెల్స్.. డబ్ల్యూహెచ్‌‌వో హెచ్చరిక

కొన్ని దేశాలకు కరోనా డేంజర్ బెల్స్.. డబ్ల్యూహెచ్‌‌వో హెచ్చరిక

జెనీవా: కరోనా వ్యాప్తి, మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితుల గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియేసస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా మహమ్మారి వల్ల ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని టెడ్రోస్ చెప్పారు. ఉత్తరార్థ గోళంలోని పలు దేశాలు ప్రమాదకర మార్గంలో పయనిస్తున్నాయని పేర్కొన్నారు. ఆయా దేశాల్లో ఆరోగ్య సేవల వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితిలో ఉందని హెచ్చరించారు.

‘కరోనా మహమ్మారిని ఎదుర్కొనే నేపథ్యంలో మనం ఇప్పుడు కీలకమైన స్థితిలో ఉన్నాం. రాబోయే కొన్ని నెలలు ఇండియా, చైనా, రష్యా, కెనడా, అమెరికా, యూకే, జర్మనీ లాంటి పలు దేశాలకు మరింత కఠినంగా మారబోతున్నాయి. అందుకే మరణాలను తగ్గించడం, అవసరమైన హెల్త్ సర్వీసెస్‌‌ కుప్పకూలిపోకుండా చూసుకోవడంతోపాటు స్కూళ్లు మూతబడకుండా తగిన చర్యలు చేపట్టాల్సిందిగా ఆయా దేశాధినేతలను మేం కో్రుతున్నాం. ఫిబ్రవరిలో చెప్పిన విషయాలనే నేను మళ్లీ రిపీట్ చేస్తున్నా’ అని టెడ్రోస్ పేర్కొన్నారు. వరల్డ్ వైడ్‌‌గా చాలా దేశాల్లో కరోనా కేసుల విషయంలో విపరీతమైన పెరుగుదల నమోదవుతోందన్నారు.