
బషీర్ బాగ్, వెలుగు: నారాయణగూడలోని బైజూస్ ఐఏఎస్ కౌచింగ్ సెంటర్ ముందు బుధవారం కొందరు స్టూడెంట్లు ఆందోళనకు దిగారు. 2022–-24 కోర్సు పూర్తికాక ముందే సెంటర్‌ను క్లోజ్ చేసి తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సిలబస్50 శాతం కూడా పూర్తికాలేదని వాపోయారు.
ఒక్కొక్కరి నుంచి రూ.1.50లక్షలు వసూలు చేశారని, ఇప్పుడు మధ్యలోనే క్లాసులు బంద్‌చేసి తమను రోడ్డున పడేశారన్నారు. ఫ్యాకల్టీని అడిగితే కోర్టులో కేసు నడుస్తోందని, తమకు ఎలాంటి సంబంధం లేదంటున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని, తమకు ప్రత్యామ్నాయం చూపాలని వేడుకున్నారు.