స్పామ్ కాల్స్ తగ్గించుకునేందుకు కొన్ని టిప్స్

స్పామ్ కాల్స్ తగ్గించుకునేందుకు కొన్ని టిప్స్

కొత్త నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఫోన్ రాగానే.. ఎవరో అనుకుని  కాల్ లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తాం. కానీ, అవతలి నుంచి ‘పర్సనల్ లోన్ కావాలా?’ అని అడుగుతుంటారు. ఇలా విసుగుపుట్టించే కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోజూ వస్తూనే ఉంటాయి. అయితే వీటిని తగ్గించుకునేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి.

టెలీ మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రోబో కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్పామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని మూడు రకాల స్పామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. వీటిలో యూజర్లను మోసం చూసేందుకు చేసే కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఉంటాయి. ఆండ్రాయిడ్ యూజర్లు వీటి బారి నుంచి బయటపడేందుకు ‘కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐడీ’, ‘స్పామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొటెక్షన్’ అనే రెండు ఫీచర్లను అందిస్తుంది గూగుల్. యూజర్లు తమ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వీటిని ఎనేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి స్పామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి తప్పించుకోవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘ఫోన్’ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్ చేసి, కుడివైపు పైన మూడు చుక్కలపై క్లిక్ చేసి ‘సెట్టింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి.  అందులో ‘కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐడీ అండ్ స్పామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొటెక్షన్’ అనే ఆప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేస్తే.. ‘టర్మ్స్ అండ్ కండిషన్స్ అంగీకరిస్తున్నారా?’ అని అడుగుతుంది. ‘అగ్రీ’  బటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై క్లిక్ చేస్తే కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐడీ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొటెక్షన్ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యాక్టివేట్ అవుతుంది. ఈ ఆప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎనేబుల్ చేస్తే రోబోటిక్ కాల్స్, స్పామ్ కాల్స్ చాలావరకూ ఆగిపోతాయి. అప్పటికీ స్పామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తుంటే..  ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి కింద ఉన్న రీసెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీకు వచ్చిన స్పామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లిక్ చేసి ఆప్షన్లలోకి వెళ్లాలి. అక్కడ బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా రిపోర్ట్ చేయొచ్చు.