టెక్నాలజీ ఉన్నా.. విపత్తులు తెలియడం లేదా?

టెక్నాలజీ ఉన్నా.. విపత్తులు తెలియడం లేదా?

రైతులను వైసీపీ ప్రభుత్వం రోడ్డుపై నిలబెట్టిందన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.టెక్నాలజీ వచ్చినా ఏం ఉపయోగం లేదన్నారు. సాంకేతికను ఉపయోగించి మార్చి, ఏప్రిల్​, మే నెలల్లో జరిగే విపత్తుల గురించి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారన్నారు. ప్రజలను అప్రమత్తం చేయకపోవడం వలనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు.అకాల వర్షాల వలన కలిగిన నష్టాలపై రాష్ట్ర ప్రభుత్వానికి అంచనాలు లేవని ఆరోపించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి అనేక అవకతవకలు జరుగుతున్నాయని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లల్లో జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ఏటా 3500 కోట్ల అక్రమాలు

మిల్లరు, సివిల్ సప్లై అధికారులు కుమ్మక్కయి రైతులను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదికి 3500 కోట్లు అక్రమాలు సివిల్ సప్లైస్ అధికారులు, మిల్లర్లు చేస్తుంటే ప్రభుత్వాలు నిద్రపోతున్నాయన్నారు. ఈ కుంభకోణం ఎప్పటినుంచో జరుగుతుందని అన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  ఈ కుంభకోణం ఎప్పటినుంచో జరుగుతుందని అన్నారు. ధర నిర్ణయించి ఆర్బికేలో అప్డేట్ చేస్తున్నారా అని ప్రశ్నించారు.