
యాదాద్రి, వెలుగు : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలందరూ కష్టపడితే గెలుపు తథ్యమని బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు సోమూ వీర్రాజు చెప్పారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో జరిగిన ముఖ్య నేతల మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్స్‌ను, వాటి వల్ల ప్రజలకు కలుగుతున్న లబ్ధిని వివరించాలని సూచించారు. బీఆర్ఎస్ సర్కారు తీరుపై ప్రజలు కోపంగా ఉన్నారని, ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపే చూస్తున్నారని చెప్పారు.
రానున్న ఎన్నికల్లో పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ బీజేపీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు అధ్యక్షతన జరిగిన మీటింగ్‌లో పోతంశెట్టి రవీందర్, పాశం భాస్కర్, నర్ల నర్సింగ్ రావు, రాఘవుల నరేందర్, పాదరాజు ఉమాశంకర్, మాయ దశరథ, రత్నపురం బలరాం, మహమూద్, జనగాం నర్సింహచారి ఉన్నారు.