‘సన్ ఆఫ్ ఇండియా ’ రివ్యూ

‘సన్ ఆఫ్ ఇండియా ’ రివ్యూ


మోహన్ బాబు కొత్త సినిమా సన్ ఆఫ్ ఇండియా ఎలాంటి అంచనాలు లేకుండా శుక్రవారం విడుదలైంది. డల్ ఓపెనింగ్స్ తో మార్నింగ్ షోస్ పడ్డాయి. ఓటీటీకి అనుకున్న సినిమా కావడం, గంటన్నర నిడివే ఉంటుందని చెప్పడంతో ఆడియెన్స్ లో పెద్దగా ఆసక్తి కలగలేదు. అండర్ డాగ్ గా ఈవారం విడుదలైన సన్ ఆఫ్ ఇండియా సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
నటీనటులు 
మోహన్ బాబు, మీనా, ప్రగ్యా జైస్వాల్, సునీల్, అలీ, నరేష్, మంగ్లీ, పోసాని, వెన్నెల కిషోర్, రాజా రవీంద్ర తదితరులు
సాంకేతిక నిపుణులు 
సంగీతం - ఇళయరాజా, సినిమాటోగ్రఫీ - సర్వేష్ మురారి, ఎడిటింగ్ - గౌతంరాజు, బ్యానర్స్ - శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, నిర్మాత - మంచు విష్ణు, రచన దర్శకత్వం - డైమండ్ రత్నబాబు.
కథేంటంటే
కేంద్రమంత్రి మహేంద్ర భూపతి (శ్రీకాంత్) కిడ్నాప్ తో కలకలం రేగుతుంది. ఈ కేసు విచారణ కోసం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) రంగంలోకి దిగుతుంది. ఎన్ఐఏ ఆఫీసర్ ఐరా (ప్రగ్యా జైస్వాల్) ఆధ్వర్యంలో నేరస్తుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలవుతాయి. ఎన్ఐఏలో డ్రైవర్ గా పనిచేసే కడియం బాబ్జీ (మోహన్ బాబు) కూడా ఈ కేసు మీద ఆసక్తి చూపిస్తుంటాడు. అదే సమయంలో ప్రముఖ వైద్యురాలు ప్రతిభలాస్య, దేవాదాయశాఖ ఛైర్మన్ భగవాన్ ప్రసాద్ (రాజా రవీంద్ర) కూడా అపహరణకు గురవుతారు. ఈ ముగ్గురిని కిడ్నాప్ చేసింది ఎన్ఐఏ లో పనిచేసే డ్రైవర్ కడియం బాబ్జీ అని తెలియగానే అంతా ఆశ్చర్యపోతారు. ఈ కడియం బాబ్జీ కేంద్రమంత్రిని ఇతరులను ఎందుకు కిడ్నాప్ చేశాడు. గతంలో విరూపాక్షగా అతని ప్లాష్ బ్యాక్ ఏంటి అనేది మిగిలిన కథ.
విశ్లేషణ
లో బడ్జెట్ లో ఓ చిన్న సినిమా చేసి ఓటీటీకి అమ్మాలనుకున్న ప్రయత్నమే సన్ ఆఫ్ ఇండియా. (ఒక్క మాట..ఈ టైటిల్ జస్టిఫికేషన్ సినిమాలో ఎక్కడా కనిపించదు). కథలో అనేక పాత్రలు వస్తుంటాయి గానీ అవేం తెరపై కనిపించవు, గొంతు మాత్రం వినిపిస్తుంది అని టైటిల్స్ లో చెప్పారు. ఇది కేవలం ఖర్చు తగ్గించుకునేందుకు చేసిందే తప్ప ప్రయోగం కాదు. కథలో ఆ పాత్రలు కనిపించాలి, ఆ స్పేస్ ఉంది. కానీ వాళ్లకు ఏమిస్తాం రెమ్యునరేషన్స్ అని నటీనటుల ముఖాలు కనిపించకుండా వాయిస్ తో లాగించారు. ఇలా ప్రగ్యా జైస్వాల్, మీనా, పృథ్వీ, పోసాని, నరేష్, తనికెళ్ల భరణి ఇలా ఎవరు ముఖాలు కనిపించవు. ఇదేం ప్రయోగమో దర్శక నిర్మాతలకే తెలియాలి. ఈ కథతో భారతీయుడు మొదలు అనేక చిత్రాలు వచ్చి ఉంటాయి. ప్రింటింగ్ లో ఎమ్మెల్యే ముఖం బదులు హీరో ముఖం ప్రింట్ చేయడం ఏంటో, దానికి అధికార పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి ముందుకు రావడం ఏంటో అర్థం కాదు. వాళ్లకు నచ్చింది రాసుకున్నారు. ఇక కులాల గురించి, రాజకీయాల్లో నైతికత గురించి మోహన్ బాబు చెప్పే సందేశాలు తెరపై విని తరించాల్సిందే. 
ఒక పక్క నీతులు చెబుతూనే ఇంకో పక్క మహిళలతో అర్థనగ్న ప్రదర్శనలు చేయించారు. మేకర్స్ నిజాయితీ ఇక్కడే తెలిసిపోతుంది. 80 లక్షలు కాదు కోటి 80 లక్షల రూపాయల ఖర్చుతో ఓ గ్రాఫిక్ పాట చేశారని చెప్పుకున్నారు. ఆ పాటే సినిమా ప్రారంభంలో వస్తుంది. ఈ పాటకు కథకు ఎక్కడా లింకే లేదు. మోహన్ బాబు బాబ్జీ, విరూపాక్ష అనే రెండు పాత్రల్లో నటించారు. ఆయనలో వృద్ధాప్యం స్పష్టంగా తెలుస్తోంది. నటుడిగా అదే హద్దుమీరిన ఉత్సాహం. మిగతా పాత్రల్లో చేసేందుకేమీ లేదు. పృథ్వీకి కులాల గురించి వర్ణించే సమయంలో మోహన్ బాబును విశ్వరూపంలో కృష్ణుడిలా ఎందుకు చూపించినట్లు అనేది ఎవరికి అర్థం కాదు. ఆయన్ని పొగడటానికి దర్శకుడు రత్నబాబు సినిమా మొత్తాన్నీ వాడాడు. 

ఫ్లస్ పాయింట్స్
దేవుడిపై రూపొందించిన పాట

మైనస్ పాయింట్స్
నాసిరకం మేకింగ్
రొటీన్ కథ
బోర్ కొట్టే స్పీచులు

వెర్డిక్ట్  
బివేర్ ఆఫ్ సన్నాఫ్ ఇండియా

మరిన్ని వార్తల కోసం: 

ప్రముఖ నటుడి సెకండ్ మ్యారేజ్

పవన్ మూవీ షూట్ కంప్లీట్