శివశంకర్ మాస్టర్ కు అండగా సోనూసూద్

V6 Velugu Posted on Nov 25, 2021

హైదరాబాద్‌: ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వైరస్ తో పోరాడుతున్న ఆయనకు సాయం చేసేందుకు నటుడు సోనూసూద్‌ ముందుకొచ్చారు. కొవిడ్ కారణంగా శివశంకర్‌ ఊపిరితిత్తుల్లో 75 శాతం ఇన్‌ఫెక్షన్‌ సోకగా.. ఆయన్ని రక్షించేందుకు డాక్టర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, ట్రీట్ మెంటుకు అవసరమైన డబ్బులను సర్దుబాటు చేయడంలో శివశంకర్‌ కుటుంబసభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో విషయం తెలుసుకున్న సోనూసూద్‌.. వెంటనే స్పందించారు. శివశంకర్‌ కుటుంబీకులతో మాట్లాడారు. మాస్టర్ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

కాగా, శివశంకర్‌ మాస్టర్‌ గత నాల్రోజుల నుంచి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన  భార్యతోపాటు పెద్దకుమారుడికి కూడా వైరస్‌ సోకింది. మాస్టర్ కొడుకు అపస్మారక స్థితిలో ఉండగా.. భార్య హోం క్వారంటైన్‌లో ఉండి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. 

Tagged Actor Sonu Sood, covid bills, Choreographar ShivaSankar, Shivasankar Master Health

Latest Videos

Subscribe Now

More News